andhra pradesh,tg venkatesh,bjp,ap capital

నా ప్రతిపాదనలకు ఓకే చెప్తే.. అన్ని పార్టీలను ఒప్పిస్తా: బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్

  • అమరావతి, రాయల సీమకు అన్యాయం చేయొద్దు
  • సీఎం జగన్ అన్ని ప్రాంతాల ప్రజలు మెచ్చుకునేలా ముందుకు సాగాలి
  • పాలన సంస్థలన్నీ విశాఖకు తరలిస్తున్నందుకే ప్రజల్లో వ్యతిరేకత  

పరిపాలన వికేంద్రీకరణ అవసరమైనప్పటికీ.. అమరావతి, రాయల సీమకు అన్యాయం చేయవద్దని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ అన్ని ప్రాంతాల ప్రజలు మెచ్చుకునేలా ముందుకు సాగాలన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ టీజీ.. రాయలసీమకు మినీ సెక్రటేరియట్, హైకోర్టు లేదా బెంచ్, శీతాకాల సమావేశాలు నిర్వహిస్తే న్యాయం చేసినట్లవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదన చేస్తే.. అన్ని పార్టీలను ఒప్పించే బాధ్యత తనదేనన్నారు.

మూడు రాజధానుల ప్రతిపాదన ప్రజలందరికి ఆమోదయోగ్యంగా లేదన్నారు. పాలన సంస్థలన్నీ విశాఖకు తరలిస్తున్నందుకే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని పేర్కొన్నారు. అటు సెక్రటేరియట్ ఉద్యోగులు విశాఖకు వెళ్లడానికి విముఖత చూపుతున్నారన్నారు.  అసెంబ్లీలో స్పీకర్, శాసనమండలిలో ఛైర్మన్ పై రాజకీయ ప్రభావం ఉంటుందన్నారు.

Tags: andhra pradesh,tg venkatesh,bjp,ap capital