home page

అవినాష్ రెడ్డి ని సిబిఐ ఎందుకు అరెస్ట్ చేయలేదు

ఇదే జగన్ ప్రత్యేక హోదా నా?

 | 
Raghu
అరెస్టు చేస్తానన్న సిబిఐ....అవినాష్ రెడ్డి ని ఎందుకు అరెస్టు చేయలేదు?
 ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వచ్చినందుకేనా?
 ముఖ్యమంత్రి కోరుకుంటున్నట్టుగా విచారణ అధికారిని మార్చాలని నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేయని సుప్రీం కోర్టు 
 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అవినీతే జరగలేదు... ఇది కేవలం బురదజల్లే కార్యక్రమమే
ఆస్కార్ లెవెల్ నటనతో 
కోడి కత్తి కేసులో జగన్, పట్టాభి కేసులో సీఐ కనకారావు, అసెంబ్లీ దాడి ఘటనలో ఆకట్టుకున్న సుధాకర్ బాబు
పేపర్ అడ్వర్టైజ్మెంట్లలో సత్యసాయి, ప్రధాని మోడీ ఫోటోలు ఎక్కడ?
 నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
 మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామని చెప్పిన సీబీఐ, అరెస్టు చేయకపోవడం ఆశ్చర్యకరం. గత నాలుగు రోజులుగా ఆయనకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదు. అరెస్టు చేయలేదు. న్యాయస్థానంలో ఉన్న ప్రతి బంధకం కూడా తొలగిపోయింది. అయినా ఎందుకు ఆయన్ని అరెస్టు చేయడం లేదని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కి రావడం వల్లే, అవినాష్ రెడ్డి ని అరెస్టు చేస్తామని చెప్పిన సిబిఐ, అరెస్టు చేయడం లేదా? అంటూ నిలదీశారు. మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా తన నివాసంలో రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... హత్య కేసులో అసలు సూత్రధారులను అరెస్టు చేయకపోతే, న్యాయస్థానంలో తుది చార్జిషీట్ ను ఎలా దాఖలు చేస్తారు. తుది చార్జిషీట్ దాఖలు చేయకపోతే, ఈ కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటూ, అరెస్టై జైలు జీవితం గడుపుతున్న శివశంకర్ రెడ్డికి బెయిలు ఎలా లభిస్తుందంటూ ప్రశ్నించారు. వైఎస్ వివేక హత్య కేసు విచారణను వేగవంతం చేయాలని శివ శంకర్ రెడ్డి సతీమణి తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు త్వరితగతిన విచారణను పూర్తి చేయాలని ఆదేశించిందన్నారు . ఈ కేసును గత మూడేళ్లుగా తేల్చడం లేదని, త్వరగా విచారణ పూర్తి చేసేలా ఆదేశించాలని తులసమ్మ తన పిటీషన్ లో కోరింది. అయితే నిజాయితీపరుడైన ఈ కేసు విచారణ అధికారిని మార్చాలని, ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కోరినట్లుగా జన బహుళ్యం లో ప్రచారం జరుగుతోందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్, జస్టిస్ ఎం ఆర్ షా బెంచ్ పైకి రావడం, కేసు విచారణను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించడంతోపాటు, విచారణాధికారి వల్లే కేసు పురోగతిలో ఆటంకాలు ఎదురైతే, ఆయన్ని మార్చాలని న్యాయ మూర్తి అభిప్రాయపడ్డారు. గతం లో ఇదే ధర్మాసనం, త్వరగా కేసు విచారణ పూర్తి చేయాలని ఆదేశించిందని ఆయన గుర్తు చేశారు. అభియోగాలను ఎదుర్కొంటున్న వ్యక్తులను విచారణకు పిలిచినా, అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ కేసు పురోగతిని అడ్డుకునేందుకు హత్య కేసులో సూత్రధారులుగా అభియోగాలను ఎదుర్కొంటున్న వారు చేయని ప్రయత్నం అంటూ లేదు. వివేక హత్య కేసు లో హంతకుడిగా అభియోగాలను ఎదుర్కొంటూ, అరెస్ట్ అయి జైల్లో ఉన్న శివ శంకర్ రెడ్డి తరఫున ఆయన సతీమణి తులసమ్మ సుప్రీంకోర్టులో పోరాటం చేయడం సబబేనని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.
 ముఖ్యమంత్రి కోరుకున్నట్లుగా జరగదు
 వైయస్ వివేకా హత్య కేసు విచారణ అధికారిని మార్చాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నట్లుగా ఏమీ జరగదని రఘురామకృష్ణంరాజు అన్నారు.  
 వైయస్ వివేక హత్య కేసు విచారణను తొలుత దీపక్ గౌర్ అనే అధికారి చేపట్టగా , ఆ తరువాత రామ్ సింగ్ కు విచారణ బాధ్యతలు అప్పగించారు. రామ్ సింగ్ ను ఎలాగైనా ఈ కేసు నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆయనపై కేసులు కూడా నమోదు చేసింది. కేసు విచారణ అధికారిగా రామ్ సింగ్, హంతకుల అరెస్ట్ తో పాటు, సూత్రధారులు ఎవరో తేల్చే ప్రయత్నాన్ని చేశారని ఆయన అన్నారు. కేసు విచారణను తెలంగాణ హైకోర్టుకు మార్చిన తర్వాత విచారణలో పురోగతి పెరిగింది. తులసమ్మ కోరుకుంటున్నట్లుగా ఈ కేసు త్వరితగతిన విచారణ జరగాలంటే, సిబిఐ తుది చార్జిషీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో శుక్రవారం లోపు సిబిఐ చురుకుగా వ్యవహరించకపోతే, కోర్టు నుంచి అక్షింతలు తప్పకపోవచ్చు. వైయస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా న్యాయస్థానం దృష్టికి ఇప్పటికే
సిబిఐ తీసుకువెళ్ళిన విషయం తెలిసిందేనని రఘురామకృష్ణం రాజు అన్నారు . ఈ కేసులో సిబిఐ నివేదికను సీల్డ్ కవర్లో అందజేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రమాద నివారణ కోసం వైయస్ వివేక హత్యకు సూత్రధారులుగా భావిస్తున్న వారు తులసమ్మ ద్వారా దాఖలు చేయించిన పిటిషన్ వల్ల కేసు విచారణ త్వరితగతిన పూర్తయితే మంచిదే. ఇంటర్నల్, ఎక్స్ టర్నల్ ద్రోహుల నుంచి నిందలు మోస్తున్న డాక్టర్ సునీతమ్మకు ఈ కేసు విచారణ త్వరితగతిన పూర్తయి ద్రోహులు ఎవరు తెలిస్తే మనశ్శాంతి లభిస్తుందని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.
 విచారణ జరుగుతుంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడడం విడ్డూరం...
  స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఒకవైపు విచారణ జరుగుతుంటే, అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే అంశంపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. ఏదోరకంగా గత ప్రభుత్వంపై బురద చల్లేందుకు నోటికి వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అసలు అవినీతి అన్నది జరగకపోయినప్పటికీ, ఏదో జరిగిపోయినట్లు మసి పూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 371 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసి, 3 లక్షల 80 వేల మందికి పైగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణను ఇచ్చేందుకు సీమెన్స్ అనే బహుళ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ లెక్కన ప్రతి విద్యార్థి పై 9, 000 రూపాయలను మాత్రమే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. అమ్మబడి, విద్యా దీవెన, తలలో దువ్వెన వంటి పథకాల ద్వారా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు కంటే, గత ప్రభుత్వం చేసింది చాలా సాధారణమైన ఖర్చు. నైపుణ్య శిక్షణ తరగతుల ద్వారా రాష్ట్రంలోని మూడు లక్షల 80 వేల మంది విద్యార్థులు శిక్షణ పొంది, సర్టిఫికెట్లను అందుకున్నారు. అవేమీ దొంగ సర్టిఫికెట్లు కాదు, తమకు తాము ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్లుగా చెప్పుకునే సర్టిఫికెట్లు కాదు. నైపుణ్య శిక్షణ తరగతుల్లో శిక్షణ పొందిన వారు, ఏ, ఏ అంశాలలో శిక్షణ పొందారో సవివరంగా వివరిస్తూ అందజేసిన ధ్రువీకరణ పత్రాలని రఘురామకృష్ణంరాజు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నైపుణ్య శిక్షణా తరగతులను నిర్వహించినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వమే సర్టిఫికెట్లను జారీ చేసింది. ఈ ప్రభుత్వ హయాంలో నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించింది లేదు. నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించకుండానే, ధ్రువీకరణ పత్రాలను ఈ ప్రభుత్వం ఎలా అందజేసింది. అంటే గత ప్రభుత్వ హయాంలో నైపుణ్య శిక్షణా తరగతులు నిర్వహించారని విషయం స్పష్టమవుతుందని పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణ తరగతులకు అవసరమైన పరికరాలను, ఈ ప్రభుత్వం ఏమైనా సమకూర్చిందా?, ప్రతి విద్యార్థి పై 9000 ఖర్చు చేయకుండానే, నైపుణ్య శిక్షణ తరగతులు పూర్తయ్యాయా?, మూడేళ్లపాటు శిక్షణ ఇచ్చేందుకు 400 మంది నిపుణులను సీమెన్స్ బహుళ జాతి సంస్థ కాకుండా, చంద్రబాబు నాయుడు సరఫరా చేశారా?, జగన్ ప్రభుత్వం ఏమైనా వారికి జీతం ఇచ్చిందా?? రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో నువ్వు కొట్టేస్తున్నట్లుగా చెబుతున్న డబ్బులతో ఒక బృహత్ కార్యక్రమాన్ని చేపడితే, అసెంబ్లీలో అభినందించాల్సింది పోయి, అనవసరమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. ఎన్నో రాష్ట్రాలలో ఇదే తరహా నైపుణ్య శిక్షణ తరగతులను సీమెన్స్ సంస్థ నిర్వహించింది. ఆయా రాష్ట్రాలను అవమానించే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలు ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ లో నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించగా, వాళ్లంతా పనికిమాలిన వాళ్ళు నువ్వేదో మేధావివైనట్టు మాట్లాడుతుండడం హాస్యాస్పదం. ఎక్విప్మెంట్ సరఫరా బాధ్యతలను వెండర్స్ కి అప్పగించినప్పుడు, సబ్ కాంట్రాక్టర్స్ కు ఇవ్వడం అనేది వ్యాపార రంగం లో సర్వసాధారణమైన ఆనవాయితీ. అయితే, ఎక్విప్మెంట్ సరఫరా చేసిన సబ్ కాంట్రాక్టర్ జీఎస్టీ సరిగ్గా చెల్లించలేదని అతనిపై దాడులు జరిగితే, గత ప్రభుత్వమేదో తప్పు చేసిందన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో మెఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఒక కాంట్రాక్టు పనిని అప్పగిస్తే, ఆ సంస్థ సరిగ్గా జీఎస్టీ చెల్లించకపోతే ఆ కంపెనీ పై ఒకవేళ జీఎస్టీ, ఈడీ శాఖలు దాడులు నిర్వహిస్తే మేఘా కంపెనీ తో జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కైనట్టేనా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు . రెండు కంపెనీల ఇంటర్నల్ వ్యవహారాలతో ముఖ్యమంత్రిగా వ్యవహరించే వ్యక్తులకు సంబంధం ఏమీ ఉంటుందని నిలదీశారు. గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ వంటి రాష్ట్రాలలో నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించినప్పుడు, అక్కడి ముఖ్యమంత్రులు ఇదేవిధంగా మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించిన ఆయన, డైవర్ట్ రాజకీయాలలో భాగంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడారని ధ్వజమెత్తారు. సీమెన్స్ కంపెనీ తో నైపుణ్య శిక్షణ తరగతుల ఒప్పందం, వోక్స్ వేగన్ కుంభకోణం లాంటిది కాదు. తమ సాఫ్ట్వేర్ కు అనువైన హార్డ్వేర్ ను సమకూర్చితే నైపుణ్య శిక్షణ తరగతులను కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద నిర్వహిస్తామని, గత ప్రభుత్వముతో సీమెన్స్ సంస్థ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమ సాఫ్ట్వేర్ ను ఉచితంగా అందజేస్తామని, హార్డ్వేర్ కోసం అవసరమైన పరికరాలను ఆయా నైపుణ్య శిక్షణ కేంద్రాలలో సమకూర్చాలని అప్పటి ప్రభుత్వానికి సూచించింది. శిక్షణ నిమిత్తం అవసరమైన పరికరాల కొనుగోలు కోసం, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే మిషన్ అండ్ టూల్స్ సంస్థ తో సంప్రదింపులు జరిపిన తరువాతే , దశలవారీగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఈ నిధులను ప్రేమ్ చంద్రా రెడ్డి అనే నిజాయితీ కలిగిన అధికారి విడుదల చేశారు. నైపుణ్య శిక్షణ తరగతుల కార్యక్రమంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రేమ్ చంద్రారెడ్డి అనే అధికారిని ఒక్కసారి కూడా విచారణకు పిలవలేదు. కేవలం తన సామాజిక వర్గానికి చెందిన అధికారి అనే ఆయన్ని విచారణకు పిలవడం లేదు. కానీ, ఈ వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేని కాపు సామాజిక వర్గానికి చెందిన శ్రీకాంత్ అనే అధికారిని మాత్రం పిలిచి వేధించారు. సిబిఐ విచారణలో తన బంధువు అరెస్ట్ అయితే, డైవర్షన్ పాలిటిక్స్ కోసం శ్రీకాంత్ ను అరెస్టు చేయాలని చూశారు. కానీ తన బంధువు అరెస్ట్ కాకపోవడంతో, శ్రీకాంత్ ను కూడా వదిలి వేశారు . సీమెన్స్ అనే సంస్థ అనేక రాష్ట్రాలలో నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించినప్పటికీ, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంతటి లేకితనంతో మాట్లాడలేదు. తాను ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని సమర్ధించడానికి మాట్లాడడం లేదు. గత ప్రభుత్వానికి మద్దతు తెలియజేయ డానికి మాట్లాడడం లేదు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దరిద్రంగా మాట్లాడుతూ ఆడిన అబద్ధానికి, అధికార పార్టీ సభ్యుడనైన తాను సిగ్గుపడి బాధతో ముఖ్యమంత్రి చెబుతున్న అబద్దాల గురించి వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు మాత్రమే మాట్లాడుతున్నాను అని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అప్రహతిత విజయం అనంతరం ఆ పార్టీపై, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పై బురద చల్లి శునకానందం పొందేందుకే అసెంబ్లీలో నైపుణ్య శిక్షణ తరగతుల్లో కుంభకోణం జరిగిందని మాట్లాడుతున్నారని రఘురామకృష్ణం రాజు ధ్వజమెత్తారు. శునకానందం అంటే ఏమిటో సకల శాఖామంత్రికి తెలుసు కాబట్టి, తాను అదే భాషలో మాట్లాడుతున్నాను. నెల్లూరులో 300 కోట్ల రూపాయల పనులు జరిగితే కేవలం ఒకే ఒక కంపెనీకి చెల్లింపులు చేసి, పనులు చేసిన మిగతా కంపెనీలను బకాయి బిల్లులు చెల్లించకుండా విస్మరించడం వెనుక ఆంతర్యం ఏమిటని తాను ప్రశ్నించానని తెలిపారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి సమాధానం లేదు. ఒక మంచి కార్యక్రమాన్ని చేపడితే, భయపెట్టే విధంగా సమాజం నీలాప నిందలు వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పి కొట్టాలి. సీమెన్స్ అనే సంస్థ తన నైపుణ్య జ్ఞానం విలువ మూడు వేల కోట్లు కాదు 30 వేల కోట్ల రూపాయలని చెబుతుంది. అది అనవసర విషయం. ఎందుకంటే ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించవలసిన అవసరం లేదన్నారు.
 ఐదు కోట్లతో పబ్లిసిటీ అవసరమా?
 కేంద్ర ప్రభుత్వ పథకాల లో భాగంగా స్కూల్ పిల్లలకు రాగి జావా అందజేసే కార్యక్రమానికి ఐదు కోట్లతో జాతీయ, ప్రాంతీయ దినపత్రికలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ప్రచారం చేసుకోవడం అవసరమా అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి 60 శాతం నిధులను కేటాయిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 40 శాతం నిధులను మాత్రమే ఖర్చు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా సొమ్ము ను సత్య సాయి ట్రస్ట్ తనవంతుగా 86 కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే, పత్రికలకు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోతో పాటు, 86 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న సత్యసాయి ఫొటోలు లేకపోవడం విడ్డూరం. ముఖ్యమంత్రి చిక్కటి చిరునవ్వులను చిందించే ఫోటో మాత్రమే పత్రికల్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లలో ఉండడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన అన్నారు.
జగన్, కనకారావు, సుధాకర్ బాబు నటన హైలెట్
 కోడి కత్తి కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పట్టాభి కేసులో సీఐ కనకారావు నటన అద్భుతం కాగా, అసెంబ్లీలో స్పీకర్ పై టిడిపి సభ్యులు దాడి చేస్తుంటే అడ్డుకోబోయినని చెబుతోన్న సుధాకర్ బాబు మోచేతికిచిన్నగా గీసుకపోగా, మోచేతికి పూర్తిగా కట్టు కట్టుకుని ముఖ్యమంత్రిని కలిసిన విధానం అద్భుతంగా ఉందని రఘురామకృష్ణంరాజు అపహాస్యం చేశారు. ముఖ్యమంత్రి తోపాటు, సుధాకర్ బాబు పక్కనే ఉన్న ఆయన సామాజిక వర్గ శాసనసభ్యులు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాలేదు. సుధాకర్ బాబు తనకు పెద్దగా దెబ్బ తగిలినట్టు ఈ సందర్భంగా అద్భుతంగా నటనను పండించారని ఆయన అన్నారు.