విశాఖ ఉక్కు ప్రయివేటీకారణ ఆగదు
కార్మికులతో చర్చలు జరుగుతున్నాయి - పార్లమెంట్ లో కేంద్రం
Mar 13, 2023, 17:20 IST
|
*స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో తగ్గేది లేదు - కేంద్రం*
విశాఖ, మిర్రర్ టుడే,మార్చ్13:
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పై కేంద్రం మరోసారి నీళ్ళు చల్లింది.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో పునరాలోచన లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ప్రైవేటీకరణలో భాగంగా కార్మికులను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిపిన కేంద్రం.. ఉద్యోగ, కార్మిక సంఘాలతో ప్లాంట్ యాజమాన్యం చర్చలు జరుపుతున్నట్టు తెలిపింది. ఉద్యోగుల ఆందోళనల నేపథ్యంలో నిర్ణయం మార్చుకుంటారా అని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రం జవాబిచ్చింది. ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర సహాయ మంత్రి ఫగ్గన్ కులస్తే స్పష్టంచేశారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో పునరాలోచన లేదని జవాబులో తెలిపారు. ఈ విషయంలో కార్మికులను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నట్టు వివరించారు. ఇప్పటికే ఉద్యోగ, కార్మిక సంఘాలతో ప్లాంట్ యాజమాన్యం చర్చిస్తోందని పేర్కొన్నారు.ప్రైవేటీకరణ నిర్ణయానికి ప్లాంట్ ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో.. గతంలో తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని దానిని మార్చే ప్రసక్తే లేదని కేంద్రం పేర్కొంది.