home page

అధికారపార్టీ అడ్డగోలు ఓట్ల రాజకీయం!

దొంగ ఓట్లు వేలల్లోనే! అధికార దుర్వినియోగం!!

 | 

 టీచర్లు, గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమ ఓట్ల పుట్ట.... అధికార పార్టీ అడ్డగోలు!

ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఎప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే.. డిగ్రీ చదివిన వారు ఎన్నుకునే ఎమ్మెల్సీ. డిగ్రీ చదివిన వారు ఎంత మంది ఉన్నా ఓటు హక్కు నమోదు చేసుకునేవారు…చాలా తక్కువ. అవి కూడా పార్టీలు ప్రత్యేకంగా బాధ్యత తీసుకుని ఓట్లు నమోదు చేపిస్తూంటాయి. ఇలాంటి పరిస్థితిని ఈ సారి అధికార పార్టీ వైసీపీ భారీగా ఉపయోగించుకుని తమకు అలవాటైన దొంగ ఓట్లను ఇష్టారాజ్యంగా నమోదు చేసినట్లుగా ఆధారాలు బయటకు వస్తున్నాయి. ఇంకా ఎన్నికలు జరగక ముందే … ఓటర్ల జాబితాలో లీలలు డిగ్రీ చదవని ఓటర్ల జాబితా మొత్తం బయటపడింది. ఒక్క తిరుపతిలోనే ఇలా ఏడు వేల మంది ఓటర్ల వరకూ ఉన్నట్లుగా రాజకీయ పార్టీలు గుర్తించాయి. దీంతో రాజకీయ పార్టీల నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో పాటు పోలింగ్ బూత్‌లలో సీనియర్లను కూర్చోబెట్టి..డిగ్రీ చదవని వారు ఓటు వేయడానికి వస్తే పట్టుకోవాలని నిర్ణయించారు. ఇది అధికార పార్టీ నేతలకు ఇబ్బందికరంగా మరింది. ముఖ్యంగా ఓట్లను నమోదు చేసుకున్న వారు.. నకిలీ సర్టిఫికెట్లు పెట్టారు. వాటి అసలైనవే అని వేరే అధికారితో ధృవీకరింపచేశారు. వీరంతా నిండా ఇరుక్కుపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో నకిలీ ఓటర్లను ఓటు వేయడానికి రావొద్దని అధికారులు ఫోన్లు చేసి హెచ్చరిస్తున్నారు. ఈ ఫోన్ ఆడియో కాల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో వైపు ఈ అంశంపై ఈసీ నిర్లక్ష్యం ఉందని.. ఇలా దొంగ ఓట్ల నమోదు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని.. వెంటనే .. పట్టభద్రులు కాని వారి ఓట్లను తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దొంగ ఓట్లతో ఇప్పటి వరకూ పెద్దఎత్తున అసెంబ్లీ ఉపఎన్నికలు…కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో విజయాలు సాధించిన వైసీపీ అదే ఫార్ములాను.. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఉపయోగించడం సంచలనం అవుతోంది. దీనిపై ఈసీ స్పందిస్తే.. ఎన్నికలపై నమ్మకం పెరుగుతుంది. స్థానిక సంస్థల నుంచి జరిగే ఎన్నికలలో ముఖ్యంగా టీచర్స్ నియోజకవర్గాల నుంచి యూ టి ఎఫ్ లేదా పిడియేఫ్ ల నుంచే ఎమ్మెల్సీ లు గెలుపొందే వారు. కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు అధికారంలో వున్నా ఈ రెండు సంఘాలకే గెలుపు ఉండేది. ఈసారి వైసీపీ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతోంది.