home page

జగన్ ను ఓడించి జనం రుణo తీర్చుకుందాం :రఘురాంరాజు

ఎంపీ రఘురామ్ రాజు విమర్శలు 

 | 
Raghu

జగన్ ను ఓడించి జనం రుణo తీర్చుకుందాం 

ప్రజల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసేందుకు జగన్ సర్కార్ ఎత్తుగడ

 అప్పిచ్చిన వారి వద్ద నుంచి  ప్రామిసరీ నోటు తీసుకున్నట్లుగా... ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వద్ద నుంచి వాలంటీర్ల ద్వారా  ప్రమాణ పత్రం కోరుతున్న ప్రభుత్వ పెద్దలు

 నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు


 రాష్ట్ర ప్రజలను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన  ప్రజల వద్ద నుంచి, అప్పిచ్చిన వ్యక్తి   ప్రామిసరీ నోటు రాయించుకున్నట్లుగా, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నుంచి వాలంటీర్ల ద్వారా ప్రమాణ పత్రం తీసుకోవాలని చూడడం  హాస్యాస్పదంగా ఉందని   నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. తాజా సర్వేలలో మా పార్టీ పని గోవిందా అని తేలడంతో, ప్రజలను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా మళ్లీ ఎన్నికల్లో  నెగ్గ వచ్చునని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వ పెద్దలు  భావిస్తున్నట్లుగా అనిపిస్తోందన్నారు. శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ప్రమాణ పత్రం పై వాలంటీర్లు కోరినట్లుగా సంతకాలు చేయకపోతే, ఎక్కడ తమ పేర్లను  తొలగిస్తారోననే లబ్ధిదారులు ఆందోళన చెందే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు  ఎలాగైనా మా పార్టీకి ఓటు వేయాలన్న ఉద్దేశంతోనే వారిని   ఎమోషనల్ బ్లాక్ మెయిల్  చేయడానికి రెడీ అయ్యారన్నారు. ప్రతి స్కీం లోను స్కామే జరుగుతోందన్న రఘురామకృష్ణం రాజు, రానున్న ఎన్నికల్లో మా పార్టీ  ప్రజలు ఓడించేస్తే.... మీరంతా ప్రమాణ పత్రం రాశారని, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయమని అంటారేమోనని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం వినియోగించిన సొమ్ము... ఏమైనా జగన్మోహన్ రెడ్డి అమ్మ బాబు సొమ్మా?, భారతి సిమెంట్స్, సాక్షి దినపత్రిక, మీడియా నుంచి ప్రజల కోసం వెచ్చించారా??  అంటూ  నిలదీశారు. గత ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చాయని గుర్తు చేశారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఈ విధంగా ప్రమాణ పత్రాలు రాయించుకున్న దాఖలాలు లేవని చెప్పారు. ప్రపంచంలో బుద్ధి ఉన్న వారెవరైనా  ఈ విధంగా రాయించుకుంటారా? అంటూ రఘురామకృష్ణం రాజు  ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ప్రజలు నన్ను ప్రశ్నిస్తున్నారని, నాకు సంబంధం లేదని చెప్పినా... మీ పార్టీ పెద్దలకు సిగ్గు లేదా అని  నిలదీస్తున్నారన్నారు. ఈ  ఈ రుణ తంత్రానికి విరుగుడు రణతంత్రం ఏమిటంటే  జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత  ప్రజలపై మోపిన  అదనపు భారాన్ని లెక్క కట్టి ప్రశ్నించడమేనని సూచించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో  నాణ్యమైన క్వార్టర్ మద్యం సీసా 60 రూపాయలకు లభించేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్యం  బ్రాండ్ల వల్ల ప్రజల ఆయుర్దార్ధం తగ్గడమే కాకుండా క్వార్టర్ మద్యం సీసా  160 నుంచి 200 రూపాయల ధర పలుకుతోందన్నారు. మద్యం సేవించే వారి ఆయురార్ధం  పక్కనపెడితే, మద్యం సేవించే అలవాటు ఉన్న  ఒక్కొక్క వ్యక్తి
సంవత్సరానికి
 30 వేల రూపాయలు  మద్యంపైనే  ఖర్చు చేయాల్సి వస్తుంది. గతంలో చెత్త పన్ను అమలులో లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క ఇంటికి ఒక్క బాత్రూం ఉంటే 120 రూపాయల చెత్త పన్ను వేశారు..  ఇప్పటికే 8 సార్లు విద్యుత్ చార్జీలను పెంచారు. గతంలో 60 రూపాయల విద్యుత్ చార్జీలు వచ్చే ఒక చిన్న కుటుంబానికి ప్రస్తుతం 375 రూపాయల విద్యుత్ చార్జీలు వస్తున్నాయని యువ గళం పాదయాత్ర సభలో నారా లోకేష్ వెల్లడించారు. అదే చిన్న కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే, సంవత్సరానికి ₹7200 విద్యుత్ వాతలు తప్పడం లేదు. రాష్ట్రంలో ఆస్తుల విలువలు  తగ్గిపోయినప్పటికీ, ఆస్తి పన్నులను మాత్రం అమాంతం పెంచారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీనితో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో కాకుండా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తూ ఉన్నారు. విద్యార్థుల ఫీజు ఖర్చులు పదివేల రూపాయల తక్కువ కాకుండా ఖర్చు అవుతాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా అమలు చేసింది ఒకే ఒక్క స్కీం అమ్మఓడి మాత్రమే. మిగతావన్నీ గత ప్రభుత్వ హయాంలో  అమలు చేసినవే. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు రెండు వేల రూపాయల వృద్ధాప్య పింఛన్ ఇవ్వగా, ప్రస్తుతం అదనంగా మరో 750 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ప్రజల ఆయురార్ధం మినహాయించి 30 వేల చొప్పున  1,20,000  రూపాయలు జగన్మోహన్ రెడ్డే ప్రజలకు రుణపడి ఉన్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. మరో నాలుగు నెలల వ్యవధిలో ఈ ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోతుంది.. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు  రుణపడిన సొమ్ముకు రుణ పత్రం మీద సంతకం చేసి ఇస్తే,  ప్రభుత్వ పెద్దలు కోరుతున్నట్లుగా ప్రజలు కూడా 
ప్రమాణ పత్రంపై  సంతకం పెట్టాలో లేదో ఆలోచిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇసుకలో 40 వేల కోట్ల రూపాయలు దోచుకున్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.. ఇసుక తవ్వకాల ద్వారా కేవలం 20 వేల కోట్ల రూపాయలు మాత్రమే దోచుకున్నారని  ఇప్పటివరకు నేను భావిస్తూ వచ్చాను. ఇసుక,  మద్యం, మట్టి ద్వారా ఒకవైపు ప్రజలను దోచుకుంటూనే... మరొకవైపు వెంకటేశ్వర స్వామి, జీసస్, అల్లా పేర్లను చెప్పి ప్రజలని
 ప్రభుత్వ పెద్దలు  ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయాలని చూడడం దారుణమన్నారు. ప్రమాణం పత్రం పేరిట మీ ఇంటి వద్దకు వచ్చే  వాలంటీర్లు ఇచ్చే డబ్బులు తీసుకోవద్దు. ఒకవేళ తీసుకున్న   మీకు బకాయి పడిన లక్షా ఇరవై వేల రూపాయలలో కేవలం 3000 రూపాయలు చెల్లించినట్లుగానే భావించాలన్నారు.

 76% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు  ఆరు పదవులేనా?

 రాష్ట్రంలో 76 శాతం మంది ఉన్న  బిసి, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారికి  తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) పాలకవర్గమండలిలో  కేవలం 6 మందికే స్థానం కల్పిస్తారా?, ఐదు శాతం మాత్రమే ఉన్న ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి మాత్రం ఏడు పదవులు  కేటాయించడం ఎంతవరకు సమంజసమని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. బిసి, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన
 కేవలం 6 మందికి పాలకవర్గంలో చోటు కల్పించి, వారి ఫోటోలను సాక్షి దినపత్రిక మొదటి పేజీలో ప్రచురించడం హాస్యాస్పదంగా ఉంది.. ముఖ్యమంత్రి ప్రతిసారి  నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని చెబుతూ  జనాభా ప్రాతిపదికన టీటీడీ పాలక  మండలి సభ్యుల నియామకంలో మాత్రం మొండి చేయి  చూపించారని మండిపడ్డారు. టీటీడీ పాలకమండలి శాశ్వత ఆహ్వానితుడిగా తూడా చైర్మన్ ఉంటారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి ప్రస్తుతం తుడా చైర్మన్ గా కొనసాగుతున్నారు.. పాలకమండలిలో  అత్యధిక జనాభా కలిగిన  బిసి, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు  చెందిన వారు ఆరు మంది ఉండగా, ఐదు శాతం జనాభా కలిగిన  ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి 9 మంది ప్రాతినిధ్యం వహించడం ఆశ్చర్యకరం. ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాటించిన సమన్యాయమని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని గంటల కొద్ది లెక్చర్లు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని ఇది అంటూ వండిపడ్డారు. ప్రస్తుతం పాలకమండలిలో ఉన్న  తన సామాజిక వర్గ  ప్రతినిధులు సరిపోరు అన్నట్లుగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన  తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను నలుగురేసి చొప్పున నియమించే అవకాశం ఉంది. గతంలో ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు హయాంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని కేవలం ఒక్కొక్కరిని మాత్రమే  టీటీడీ పాలక మండలి సభ్యులుగా నియమించేవారు. అది కూడా  భక్తులైన వ్యక్తులకు మాత్రమే స్థానం కల్పించడం అన్నది ఆనవాయితీగా వచ్చింది. మా ప్రాంతీయ పార్టీ జాతీయ హోదాను నిలబెట్టుకునేందుకే కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన  వారిని నలుగురేసి చొప్పున  టీటీడీ పాలకమండలిలో స్థానం కల్పించనున్నారని  రఘురామకృష్ణం రాజు తెలిపారు. తెలంగాణలోనూ పోటీ చేసే దిక్కు లేక  ఇద్దరికీ రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టారన్నారు. అలాగే ముంబైకి చెందిన మరొక వ్యక్తికి కూడా తన తండ్రిని చంపారన్న అభియోగాలను కూడా పక్కన పెట్టి రాజ్యసభ సభ్యుడిగా అవకాశాన్ని  కల్పించి జగన్మోహన్ రెడ్డి తన ఉదారతను చాటుకున్నారని ఎద్దేవా చేశారు . ప్రత్యేక ఆహ్వానితులుగా మరొక 50 మందిని నియమించినప్పటికీ, కోర్టు, ఆ నియామకాలను నిలిపివేసింది. టీటీడీ పాలకమండలి సభ్యుడిగా  మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చిన  శరత్ చంద్రారెడ్డిని నియమించిన విషయాన్ని  విలేకరులు రఘురామకృష్ణం రాజు   దృష్టికి తీసుకురాగా, 32 ఆర్థిక నేరాభియోగ  కేసులలో 16 నెలల పాటు జైలు శిక్ష అనుభవించి, బెయిల్ పై వచ్చిన వ్యక్తి  ఒక్క అవకాశం అంటే  ప్రజలు మోసపోయి గెలిపించారని అటువంటి  వ్యక్తి పాలన... శరత్ చంద్రారెడ్డిని  టీటీడీ బోర్డు  సభ్యుడిగా నియమించడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదన్నారు.

 మితిమీరిన మాటలు మాట్లాడిన ప్రవీణ్ ప్రకాష్

 రాజ్యాంగంలోని 21A అధికరణ ప్రకారం ఐదు నుంచి  15 -16 ఏళ్ల మధ్య బాలలకు ఉచితంగా విద్యా సౌకర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇప్పుడు అదేదో కొత్తగా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టినట్లుగా, నూటికి నూరు గ్రాస్ రూట్ ఎన్రోల్మెంట్ జరగలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని విద్యాశాఖ  ఉన్నతాధికారి ప్రవీణ్  ప్రకాష్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. గతంలో ఉద్యోగాన్ని విడిచి రాజకీయాలలో చేరాలని ప్రవీణ్ ప్రకాష్ భావించారు. కానీ ఎందుకో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మరి ఇప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేస్తే  జగన్మోహన్ రెడ్డి ఆయనకు రాష్ట్రంలోనే అవకాశాన్ని కల్పిస్తారా?, జాతీయ పార్టీ కాబట్టి దేశంలో మరెక్కడైనా అవకాశాన్ని కల్పిస్తారా?? అంటూ అపహస్యం చేశారు. ప్రవీణ్ ప్రకాష్ వ్యవహార శైలిపై  అనేక ఫిర్యాదులు ఉన్నాయన్న రఘురామకృష్ణంరాజు, విద్యార్థుల ఎదురుగానే ఉపాధ్యాయులను దుర్భాషలాడడం, విద్యార్థుల వద్ద టెక్స్ట్ బుక్స్ లేవన్న కారణంగా వారిని నిందించడం... అంతటితో ఆగకుండా ఉపాధ్యాయులను, మండల విద్యాధికారులను సస్పెండ్ చేయడం చేశారన్నారు. విద్యార్థులకు విద్యాశాఖ టెక్స్ట్ బుక్స్ సరఫరా చేయకపోతే, టీచర్లు ఏమైనా తమ జీతంలో నుంచి డబ్బులు తీసి  టెక్స్ట్ బుక్స్ కొనిపెడతారా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలోని తొమ్మిది వేల పాఠశాలలో  సింగల్ టీచర్లు మాత్రమే పని చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పనులన్నీ చేయడంతో పాటు, విద్యార్థులకు విద్యాబోధన  చేస్తున్నారన్నారు .. తెలుగు భాష సరిగ్గా మాట్లాడడం రాని ముఖ్యమంత్రి, తెలుగు మీడియంను బహిష్కరించారు. రాజ్యాంగ  సూత్రాలకు కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసిన ఒక వ్యక్తి, రాజ్యాంగ సూత్రాలకు భిన్నంగా వ్యవహరిస్తే అతన్ని పదవిలో నుంచి తొలగించే అధికారం  కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ సూత్రాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఒక ఉపాధ్యాయుని కూడా నియమించకుండా, 6000 పాఠశాలలను ఎత్తివేయడమే కాకుండా, 39 వేల టీచర్ల పోస్టులను భర్తీ చేయకుండా పెండింగ్లో పెట్టారన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న  ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రవీణ్ ప్రకాష్ దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో ఎప్పటి నుంచో  ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే  విద్యార్థులు ఆంగ్ల అక్షరాలు నేర్చుకున్నట్లుగా  వ్యవహరించడం హస్యాస్పదంగా ఉంది.  వాలంటీర్ల సహకారంతో నూటికి నూరు శాతం గ్రాస్ రూట్ ఎన్రోల్మెంట్ సాధిస్తానని  ప్రవీణ్ ప్రకాష్ పేర్కొనడం, ముఖ్యమంత్రి మెప్పు కోసం కాకపోతే మరి ఏమిటని   రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.