home page

కోడికత్తి కేసులో జగన్ హాజరు తప్పనిసరి : ఎన్ ఐ ఏ కోర్టు

 | 
Kodi kathi ase

విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు కోడికత్తి కేసు లో విచారణ  సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ ఘటనలో బాధితుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానానికి హాజరు కావాలని ఆదేశించింది.

కోర్టుకు జగన్ హాజరు కావాలి 
 
కోడి కత్తి కేసులో బాధితుడు- అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయను ఇక విచారణకు రావాల్సి ఉంటుంది. తదుపరి విచారణకు వైఎస్ జగన్ కూడా హాజరు కావాల్సి ఉంటుందని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. గతంలోనూ ఇవే తరహా ఆదేశాలను ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది ఎన్ఐఏ కోర్టు.
2018లో..
 2018లో సార్వత్రిక ఎన్నికల సమయంలో విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై శ్రీనివాస రావు అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. కొద్దిరోజుల పాటు ఆయన హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.
విచారణకు హాజరు..
 ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస రావు. విశాఖపట్నం వీఐపీ లాంజ్ లో వైఎస్ జగన్ పై కోడి కత్తితో దాడి చేశాడనే ఆరోపణలను ఎదుర్కొంటోన్నాడు. నాలుగు సంవత్సరాలుగా అతను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటోన్నాడు. విచారణ కోసం ఇవ్వాళ ఎన్ఐఏ కోర్టుకు అతన్ని హాజరు పరిచారు. ఇరు పక్షాలకు చెందిన న్యాయమూర్తులు తమ వాదనలను వినిపించారు.
జగన్ తో పాటు..
 బాధితుడు వైఎస్ జగన్ తో పాటు- విశాఖపట్నం విమానాశ్రయ భద్రతను పర్యవేక్షిస్తోన్న కేంద్రీయ రిజర్వ్ పోలీస్ బలగాల అసిస్టెంట్ కమాండర్ దినేష్ కుమార్, ప్రత్యక్షసాక్షి కూడా విచారణకు హాజరు కావాలని కోర్టు తాజాగా ఆదేశించింది. ఈ కేసులో 3వ సాక్షిగా వైఎస్ జగన్ పీఏ నాగేశ్వర రెడ్డి ఉన్నారు.
ఏడు సార్లు బెయిల్ కోసం..
 కోడికత్తి శ్రీనివాస రావుకు ఇప్పటివరకు బెయిల్ లభించలేదు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోన్నందున బెయిల్ లభించడం కష్టతరమౌతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. శ్రీనివాస్ తరఫున ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటివరకు ఏడుసార్లు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్లు చెబుతున్నారు.
జగన్ ఎన్‌ఓసీ ఇస్తేనే..
 ఈ కేసులో బాధితుడయిన వైఎస్ జగన్.. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తేనే కోడికత్తి శ్రీనుకు బెయిల్ లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. బెయిల్ పొందడానికి జగన్ నుంచి ఎన్ఓసీని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని న్యాయవాది సలీమ్ చెప్పారు. ఎన్ఓసీ కోసం ప్రయత్నిస్తోన్నామని వివరించారు.