home page

ముందస్తు ఎన్నికలకు జగన్

ప్రతిపక్షం బలపడక ముందే ఎన్నికలలో వ్యూహం 

 | 
Bye bye jagan

సగం మందికి  మొండి చెయ్యి 

ముందస్తు ఎన్నికలకు జగన్ సిద్ధమవుతున్నారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.ప్రతిపక్షాలు పొత్తులు,రాజకీయ వ్యూహాలు,ఎన్నికల కార్యాచరణపై దృష్టి సారిస్తుండగా,షెడ్యూల్ కంటే ముందే ఎన్నికల కోసం జగన్ ప్రయత్నిస్తున్నారు.
జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల పైనే దృష్టి పెట్టార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.2024 ఎన్నికల కార్యాచరణ ప్రణాళికను రూపొందించే పనిలో జగన్,ఆయన వర్గం బిజీగా ఉన్నట్లు సమాచారం.నియోజకవర్గాల వారీగా శాసనసభ్యుల పనితీరును జగన్ సమీక్షిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల సెలవులను కూడా ప్రభుత్వం రద్దు చేసింది.సిబ్బందికి మెడికల్ లీవ్స్ కావాలంటే అనుమతి కోసం కలెక్టర్‌ను సంప్రదించాలి.జిల్లా కలెక్టర్లు కూడా వీవీప్యాట్‌లను తనిఖీ చేసే పనిలో నిమగ్నమయ్యారు.
ఇటీవల వైసీపీ కోర్ కమిటీ సమావేశమై జగన్ అధ్యక్షతన సమావేశం జరిగింది.ముందస్తు ఎన్నికలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులపై మరో 10 రోజుల్లో జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఈ చర్యలన్నీ షెడ్యూల్ కంటే ముందే అసెంబ్లీ ఎన్నికల దిశగా వైసీపీ దూసుకెళ్తోందని సూచిస్తున్నాయి.ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తూ బలపడకముందే ఎన్నికలను ముగించాలని జగన్ భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు తెలిపారు.Jagan modi