home page

పెద్దిరెడ్డి దోపిడీ జగన్ కి తెలియదా : జీవి రెడ్డి ఆరోపణ

 | 
• ల్యాండ్, శాండ్, మైనింగ్ మాఫియా, కన్ స్ట్రక్షన్, మద్యం వ్యాపారాలతో దోపిడీలో మంత్రి పెద్దిరెడ్డిదే అగ్రస్థానం
• పెద్దిరెడ్డికి భయపడి జగన్ రెడ్డి, సజ్జల స్పందించడం లేదా…లేక తాడేపల్లి ప్యాలెస్ కు వాటా అందుతోందని ఉపేక్షిస్తున్నారా?
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీ.వీ.రెడ్డి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరులోనే పెద్దరికం ఉందని, ఆయన పనులు మాత్రం చాలా అథమంగా ఉన్నాయని, చిత్తూరుజిల్లా వైసీపీనేతలే పెద్దిరెడ్డి అవినీతి, ఆగడాలపై అక్కసు వెళ్లగక్కుతున్నారని, మంత్రి ఆయన కొడుకు మిథున్ రెడ్డి చేస్తున్న దోపిడీ తారాస్థాయికి చేరిందని, నాలుగేళ్లలో రూ.35వేలకోట్ల వరకు కాజేశారని, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీ.వీ.రెడ్డి తెలిపారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ ల్యాండ్, శాండ్, మైనింగ్ మాఫియా, కన్ స్ట్రక్షన్, మద్యం వ్యాపారాలతో వైసీపీప్రభుత్వ దోపిడీలో మంత్రిపెద్దిరెడ్డే అగ్రస్థానంలో ఉన్నాడు. ఎదిరించేవారిని బెదిరిస్తూ, తప్పుడుకేసులతో వేధించి, దారికి తెచ్చుకొని పెద్దిరెడ్డి తన అవినీతి, అక్రమాలను అప్రతిహతంగా కొనసాగిస్తున్నాడు. పెద్దిరెడ్డి ఆగడాలు, అవినీతి గురించి ముఖ్యమం త్రికి తెలిదను కోవడం పిచ్చితనమే.
సొంతపార్టీ నేతలే పెద్దిరెడ్డి దోపిడీపై మాట్లాడుతుం టే, తోటిమంత్రి చేస్తున్న చీకటి పనులు జగన్ రెడ్డికి తెలియకుండా ఉంటాయా? తాడేపల్లి ప్యాలెస్ కు వాటాలు ముట్టచెబుతూ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ముఖ్యమంత్రిని కూడా లెక్కచేయకుండా ఈ స్థాయిలో దోపిడీ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి నుంచి కిందిస్థాయి అధికారివరకు ఎవరూ పెద్దిరెడ్డిని ప్రశ్నించే పరిస్థితి లేదు.
శాండ్ మాఫియా.. అక్రమ మైనింగ్ అడ్డూఆపు లేకుండా సాగుతోంది
శాండ్ మాఫియాతో వేలకోట్లు దోచుకుంటున్న పెద్దిరెడ్డి, రోజుకి 4 వందల నుంచి 5 వందల లారీల ఇసుకను పక్కరాష్ట్రాలకు తరలిస్తున్నాడు. టీడీపీప్రభుత్వం ఉచితంగా అందించిన ఇసుకను పెద్దిరెడ్డి లాంటి వైసీపీనేతలు తమ వ్యాపారవనరుగా మార్చు కున్నారు. మైనింగ్ మాఫియాతో సహజసంపదను కొల్లగొడుతున్నాడు. వైసీపీ ప్రభు త్వం వచ్చినప్పటినుంచీ పెద్దిరెడ్డి ఇలాఖాలో అక్రమ మైనింగ్ అడ్డూఆపు లేకుండా సాగుతోంది. ప్రజల, ప్రభుత్వ ఆస్తిని మంత్రిగా ఉన్నవ్యక్తి ఇలా దోచేస్తుంటే, ముఖ్యమం త్రి స్పందించడా?
కన్ స్ట్రక్షన్ సంస్థ ముసుగులో ప్రభుత్వసొమ్ము కొల్లగొడుతున్నాడు
నిర్మాణరంగం (కన్ స్ట్రక్షన్) ముసుగులో పీ.ఎల్.ఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ ను ఏర్పాటుచేసి, దానికి అనుబంధంగా చిన్నాచితకా 61కంపెనీలు పెద్దిరెడ్డి సృష్టించా డు. బినామీలు, బంధువుల్ని డైరెక్టర్లుగా పెట్టి, ప్రభుత్వ కాంట్రాక్టుల్ని చేజిక్కించుకొని, నాసిరకంగా పనులచేస్తూ, బిల్లులు చేసుకుంటున్నారు. పుంగనూరు సమీపంలోని అవులపల్లి, తంబళ్లపల్లి, నేతికుట్టపల్లి రిజర్వాయర్ల నిర్మాణంపై ఎన్జీటీ రూ.100కోట్ల జరిమానా వేసిందంటే దానికి కారణం పెద్దిరెడ్డి కంపెనీ చేసిన పనులే.
ఆ రిజర్వాయర్ల కు ఎన్జీటీ అనుమతులు లేకపోయినా పీ.ఎల్.ఆర్ ప్రాజెక్ట్స్ పనులు చేపట్టింది. డబ్బుల కోసం పీ.ఎల్.ఆర్ ప్రాజెక్ట్స్ అడ్డగోలుగా పనులుచేపడితే, ఎన్జీటీ వేసిన రూ.100కోట్ల జరిమా నాను ప్రభుత్వం చెల్లించింది. కాంట్రాక్ట్ సంస్థ కట్టాల్సిన సొమ్ముని ప్రభుత్వం కట్టడమేం టి? ప్రజలసొమ్ముని ఇలా తనమంత్రి కంపెనీకి దోచిపెట్టడం ముఖ్యమంత్రికి ఎంతవర కు సబబు?
నాసిరకం మద్యం అమ్మకాల
రాయలసీమలోని ఒక ప్రముఖ డిస్టిలరీని చేజిక్కించుకున్న పెద్దిరెడ్డి, అక్కడ తయార య్యే నాసిరకం మద్యాన్ని అధికధరకు విక్రయిస్తూ, వేలకోట్లు దోచేస్తున్నాడు. ఒక క్వార్టర్ సీసా మద్యం తయారీతో కలిపి రూ.12లు పడుతుంటే, దాన్ని బయట రూ.10 0 నుంచి రూ.200వరకు విక్రయిస్తున్నారు. ముఖ్యమంత్రికి తెలియకుండా పెద్దిరెడ్డి మద్యం వ్యాపారం చేస్తున్నాడంటే ఎవరు నమ్ముతారు?
ప్రభుత్వఆస్తులు అమ్మడం.. తాకట్టు పెట్టడం.. అప్పులు చేయడంపై జగన్ రెడ్డికి ఉన్న శ్రద్ధ, మంత్రులు, వైసీపీనేతల అవినీతి కట్టడిలో లేదు
భూకబ్జాలు, ఇసుకదోపిడీ, మైనింగ్ మాఫియా, కన్ స్ట్రక్షన్, మద్యం వ్యాపారాలతోనే పెద్దిరెడ్డి ఈ నాలుగేళ్లలో రూ.35వేలకోట్లు కొల్లగొడితే, ఇతర మార్గాల్లో ఎంత దోచేసి ఉంటాడు? ప్రభుత్వఖజానాకు చేరాల్సిన సొమ్ము అడ్డదారిలో తనఖజానాకు చేర్చుకుం టున్న పెద్దిరెడ్డిని ముఖ్యమంత్రి ఎందుకు ఉపేక్షిస్తున్నాడు? ప్రభుత్వ ఆస్తులు, భూము లు అమ్ముతూ, ప్రజలపై పన్నులభారం వేస్తున్న ముఖ్యమంత్రి, సొంతపార్టీ నేతలు, మంత్రుల దోపిడీని ఎందుకు కట్టడి చేయడంలేదు?
పెద్దిరెడ్డి దోపిడీని జగన్ అరికట్టి ఉంటే, ప్రజలపై చెత్తపన్ను వేయాల్సిన పరిస్థితి వచ్చేదా? అధికధరకు పెట్రోల్ డీజిల్ అమ్మాల్సిన దుస్థితి వచ్చేదా? ఇతర రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి కంటే మెరుగ్గా సంక్షేమ పథకాలు అందిస్తూ, అభివృద్ధిచేస్తున్నాయి. కానీ జగన్ ఒక్కడే అప్పులు తెస్తూ, అత్తె సరు సంక్షేమపథకాలు అమలుచేస్తూ, దోచుకోవడానికి తనపార్టీవారికి లైసెన్స్ ఇచ్చా డు.
మంత్రి పెద్దిరెడ్డి దోపిడీపై ముఖ్యమంత్రి, ప్రభుత్వ సలహాదారు సజ్జల ఏం సమాధా నం చెబుతారు? సొంతపార్టీ వారికి కనిపించిన పెద్దిరెడ్డి దోపిడీ, జగన్ రెడ్డికి, సజ్జలకు కనిపించకపోవడం సిగ్గుచేటు.
మంత్రులు, వైసీపీనేతల్ని దోచుకోవడానికి రాష్ట్రంపై వదిలేసిన జగన్ రెడ్డి, పన్నులువేస్తూ, ఛార్జీలు పెంచుతూ, ఎందుకు తమను దోచు కుంటున్నాడో ప్రజలు కూడా ఆలోచించాలి. మంత్రులందరూ పెద్దిరెడ్డి బాటలోనే నడు స్తున్నారు. వారివారి నియోజకవర్గాల్లో ఎవరికివారు అవినీతి, దోపిడీలో పోటీ పడుతున్నారు. కర్ణాటకలో గతంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 40శాతం కమీషన్లు తీసుకుందని విన్నాం… కానీ ఏపీప్రభుత్వం 50శాతం కమీషన్లు తీసుకునే ప్రభుత్వంగా ఖ్యాతి పొందింది.” అని జీ.వీ. రెడ్డి ఎద్దేవా చేశారు.