home page

మే0 చెప్పిన విషయాలను సిబిఐ పట్టించుకోవడం లేదు: అవినాష్

నాన్న అరెస్ట్ పై మాట రావడం లేదు : అవినాష్ 

 | 

వై. ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో వై. ఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు ఆదివారం అరెస్ట్ చేసారు. హైదరాబాద్ నుంచి పులువెందుల చేరుకున్న సిబిఐ అధికారులు భాస్కరరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా సిబిఐ దర్యాప్తును ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది.

అయితే తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ విషయం తెలుసుకున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందుల చేరుకున్నారు. హైదరాబాద్ నుండి పులివెందుల చేరుకున్న ఆయన మాట్లాడుతూ.. విచారణలో కీలక విషయాలను సిబిఐ వదిలేసిందన్నారు. సిబిఐ సిల్లీ విషయాలను సీరియస్ గా తీసుకుంటుందని ఆరోపించారు అవినాష్ రెడ్డి. భాస్కర్ రెడ్డిని ఊహించని విధంగా అరెస్టు చేశారని.. తనకి మాట్లాడడానికి మాటలు కూడా రావడం లేదన్నారు.

ధైర్యం కోల్పోకుండా నిజాయితీని నిరూపించుకుంటామన్నారు అవినాష్ రెడ్డి. పాత అధికారి చేసిన విచారణనే కొత్త బృందం ఫాలో అవుతుంది తప్ప మేము చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. వివేకా హత్య కేసు విషయాన్ని ముందు పోలీసులకు చెప్పింది తానేనని.. ఘటనా స్థలానికి తొందరగా రావాలని పోలీసులకు మూడుసార్లు ఫోన్ చేశాననిఅవినాష్ తెలిపారు.