ఇక్కడ మీకో విషయం చెప్పాలి సర్ - మోదీతో వైఎస్ జగన్
ఇక్కడ మీకో విషయం చెప్పాలి సర్ - మోదీతో వైఎస్ జగన్
విశాఖపట్నం కేంద్రంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కొన్నింటిని ప్రారంభించారు.
అనుబంధం రాజకీయాలకు అతీతం..
అనంతరం వైఎస్ జగన్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి ఉన్న అనుబంధం గురించి ప్రస్తావించారు. కేంద్రంతో ప్రత్యేకించి- ప్రధానితో తమ అనుబంధం- పార్టీలకు, రాజకీయాలకు అతీతమని చెప్పారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప తమకు మరో అజెండా లేదని స్పష్టం చేశారు. తమ రాష్ట్రానికి, ప్రజలకు గత ప్రభుత్వం ఎంతో అన్యాయం చేసిందని పేర్కొన్నారు. అలాంటి రాష్ట్రానికి పెద్ద మనసు చేసుకుని మేలు చేయాలని, దీన్ని ప్రజలు చిరకాలం గుర్తు పెట్టుకుంటారని వైఎస్ జగన్ అన్నారు.
ప్రత్యేక హోదా.. రైల్వే జోన్..
రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విభజన హామీలను పరిష్కరించాలని వైఎస్ జగన్- ఈ సభ ద్వారా ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తాము అనేక మార్లు విజ్ఞప్తి చేసిన అంశాలను మళ్లీ వినిపిస్తున్నానని పేర్కొన్నారు. పోలవరం నిధుల బకాయిలు విడుదల, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిలుపుదల, విశాఖకు రైల్వే జోన్ కేటాయింపు తదితర అంశాలపై సానుకూలంగా స్పందించి న్యాయం చెయ్యాలని కోరుతున్నానని అన్నారు.
మరి కొన్నింటికి శంకుస్థాపన చేశారు. వీటి మొత్తం విలువ 10,500 కోట్ల రూపాయలు. విశాఖపట్నం చేపలరేవు ఆధునికీకరణ, కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకు ఆరులేన్ల జాతీయ రహదారి పనులు, పోర్ట్ కనెక్టివిటీ కోసం అదనంగా నాలుగు లేన్ల డెడికేటెడ్ పోర్ట్ రోడ్ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు.
ఏయూలో సభ. : ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన- గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సభకు ఉత్తరాంధ్రతో పాటు ఉత్తర కోస్తా జిల్లాల నుంచీ పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. సభా ప్రాంగణం కిటకిటలాడింది. భారతీయ జనత పార్టీ రాష్ట్రశాఖ నాయకులు, కార్యకర్తలు ఈ సభకు హాజరయ్యారు.
మోదీకి సన్మానం..
తొలుత- ఆంధ్రా యూనివర్శిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి ప్రాజెక్టుల నమూనాలను ప్రధాని పరిశీలించారు. అనంతరం వేదికపైకి చేరుకున్నారు. వైఎస్ జగన్ ఆయనను శాలువ కప్పి సన్మానించారు. శ్రీవేంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని జ్ఞాపికగా అందించారు. అశ్విని వైష్ణవ్ ప్రసంగంతో ఈ సభ ఆరంభమైంది. రాష్ట్రానికి మంజూరు చేసిన ప్రాజెక్టులు, వాటి వివరాలను ఆయన వెల్లడించారు. ఏపీ పురోభివృద్ధికి ఇవి దోహదపడతాయని వ్యాఖ్యానించారు.