home page

ఏమిటీ వైసీపీ ట్వీట్ల గొడవ?

రఘురామ పై రెట్టల రచ్చ 

 | 
Raghu

వైసీపీకీ, ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామరాజుకు మధ్య వార్ మళ్లీ ముదురుతోంది. గతంలో వైసీపీతో విభేదించి పోరు మొదలుపెట్టిన రఘురామ.. సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలందరిపైనా తీవ్ర విమర్శలు చేసేవారు. మధ్యలో కొంత కాలం వార్ రూమ్ ఫైటింగ్ తగ్గినా ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్న ట్విట్టర్ కామెంట్ జోరుపెరిగింది. సోషల్ మీడియా హాండిల్ చేసే వాళ్లు వైఎస్సార్సీపీ మంత్రుల పేరిట రఘురామ రాజుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. అన్ని ఫార్మాట్లకు ఒకే రకమైన వ్యాఖ్యానాలు వుంటున్నాయి. కొంత కాలం విజయ సాయిరెడ్డికి వ్యతిరేకంగా రఘు ట్వీట్లుపెట్టేవారు. అయితే ఈ మధ్య రఘురామ శాంతించారు. వైసీపీ నేతలు ట్వీట్లు పెడుతున్నా వాటిపై రియాక్ట్ కావపడం లేదు. ఇదే అదనుగా వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డిని రెచ్చగొడుతూ మరిన్ని ట్వీట్లు పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీ నేతల తీరుపై ఇవాళ రఘురామకృష్ణంరాజు స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, తనపైనా వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారని రఘురామ ఆరోపించారు. పరిస్ధితి చూస్తుంటే త్వరలో 150 మంది ఎమ్మెల్యేలతో తనపై ట్వీట్‌లు పెట్టిస్తారేమోనని రఘురామ వ్యాఖ్యానించారు. అయితే ఈ ట్వీట్‌లు పెట్టినవారిని తాను అభినందిస్తున్నట్లు రఘురామ తెలిపారు. అదే సమయంలో తెర వెనుక నుంచి తనపై ట్వీట్లు పెట్టించొద్దని సీఎం జగన్ ను కోరారు.
మరోవైపు తనపై వైసీపీ నేతలు పెడుతున్న వరుస ట్వీట్లపై మాట్లాడిన రఘురామరాజు.. వారు ఎంత రెచ్చగొట్టినా తాను రెచ్చిపోనని స్పష్టం చేశారు. తద్వారా తాను భవిష్యత్తులోనూ ఈ ట్వీట్లు, విమర్శలపై సంయమనం పాటిస్తానని చెప్పకనే చెప్పారు. దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే రఘురామ వైసీపీ నేతలపై పెట్టిన ట్వీట్లు, వారి రియాక్షన్లపై జాతీయ స్దాయిలో ఇతర పార్టీల నేతలు చర్చించుకునే పరిస్దితి వచ్చింది.