home page

రుషికొండ తవ్వకాలపై మేమే కమిటీ వేస్తాo : హైకోర్టు

 | 
Rushikonda
*ఋషికొండ అక్రమ తవ్వకాలపై హైకోర్టు సీరియస్*
*కమిటీని తామే నియమిస్తామని వ్యాఖ్య*
విశాఖ, మిర్రర్ టుడే,డిసెంబర్22:
ఋషికొండ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వంపై సీరియస్ అయింది.అక్రమ తవ్వకాల కేసులో ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడి తవ్వకాలపై పరిశీలించేందుకు ఉద్దేశించిన కమిటీలో సభ్యులను తామే నిర్ణయించాలని కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ తవ్వకాలపై నిగ్గు తేల్చేందుకు హైకోర్టు ఓ కమిటీ వేయాలని ఆదేశించింది. అయితే కమిటీలో ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కేంద్రం నిర్ణయించింది. దీనిపై పిటీషనర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నియమకాలు కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని గతంలోనే పేర్కొన్నారు. దీనిపై అఫడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో నియమించిన కమిటీని సమర్థిస్తూ కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేయడంపై హైకోర్టు ఆశ్చర్యపోయింది. చూస్తుంటే రాష్ట్రంతో కేంద్రం చేతులు కలిపినట్లు కన్పిస్తోందని వ్యాఖ్యానించింది. అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఇవాళ అఫిడవిట్‌ దాఖలు చేయాలని పిటీషనర్లకు కోర్టు ఆదేశించింది. రేపు ఉదయం కేసును విచారిస్తామని,తామే కమిటీని నియమించాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.