గర్జించని విశాఖ :అయోమయంలో వైసిపి
ఉద్యమ నిర్మాణం సాధ్యమా ?
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దు మొర్రో అంటున్న విశాఖ వాసులు
విశాఖపట్నంలో దిశగా గర్జన పేరిట నిర్వహించిన సభ విఫలం కావడంతో వైసీపీ కార్యకర్తలు ,వైసిపి నాయకులు ఆందోళన చెందుతున్నారు .ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మనసెరిగి ముందుకు పోవాలనుకున్న ఉత్తరాంధ్ర వైసిపి నేతలు ముఖ్యంగా మంత్రులు ధర్మాన ప్రసాదరావు ,బొత్స సత్యనారాయణ ఈ ఉద్యమాన్ని మరింత గట్టిగా ముందుకు తీసుకువెళ్లాలని పట్టు బిగిస్తున్నారు .అయితే విశాఖ ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు వాస్తవానికి విశాఖపట్నం ప్రజలెవరూ యుద్ధాన్ని కోరుకోవడం లేదు .ఎప్పుడూ ప్రశాంతంగా నిశ్చలంగా ఉండు విశాఖపట్నం అలాగే ఉండాలని రాజధాని పేరుతో రణగొణ ధ్వనులు వద్దని కోరుకుంటున్నారు .ప్రశాంతతకు పెట్టింది పేరు విశాఖ తీరం .ప్రకృతి సహజ వనరులతో అభివృద్ధి కొనసాగుతున్న విశాఖకు కొత్తగా తీసుకువచ్చిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు .అధికార పార్టీ ముసుగులో కొంతమంది వైసిపి నాయకులు లేపేసిన భూములు, కబ్జాలు అక్రమాలు వెలుగుచూశాయి .దీంతోనే విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది .పైగా విశాఖపట్నం జిల్లాను మూడు జిల్లాలుగా విభజించిన తర్వాత విభజిత విశాఖజిల్లా పరిమితమైపోయింది కేవలం ఏడు మండలానికే పరిమితం అయిపోయింది భారీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ పార్క్ వంటి ప్రధానమైన సంస్థలన్నీ అనకాపల్లి జిల్లాకు వెళ్లిపోయాయి విశాఖకు మిగిలింది బీచ్ రోడ్లో ఉన్న ఇసుక దిబ్బలు ఎర్రమట్టి దిబ్బలు .కొట్టేసిన విశాఖ రుషికొండ లు .ఇవే మిగిలాయి .విశాఖపట్నం నుంచి భీమిలి బరువు భీమిలి వరకూ బీచ్రోడ్డు అందాలు అంతకంతకు తగ్గాయి. భూముల ఆక్రమణలు పెరిగాయి .సొంత ఇంటిని కూడా ఎవరైనా కబ్జా చేస్తారన్న భయం ప్రజల్లో నెలకొంది .విశాఖ కబ్జాకోరు కబంధ హస్తాల్లో వెళ్లిపోయిందన్న భయం ప్రజల్లో ఇప్పటికే ఉంది . ఇలాంటి దశలో విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవసరమా అన్న చర్చ కూడా జరుగుతోంది . విశాఖ జిల్లా వైసిపి నాయకుడు తలపెట్టిన గర్జనలో నోరు విప్పిన విశాఖ నాయకుడే లేడు . రెవెన్యూ మంత్రి ధర్మాన మాత్రమే మాట్లాడారు. ఇప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో ఆయన ప్రారంభించిన జానీ ఉద్యమం మాత్రమే ఉద్యమం ఇక అడుగులు పడుతుంది .అది పెరిగి మహోద్యమంగా మారుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి .విశాఖకు రాజధాని కావాలి అన్న ఆశయంతో రాజకీయేతర జేఏసీ ఏర్పడింది . వైసీపీ దాంతో ఉత్తరాంధ్రలో మూడు రాజధానుల వ్యవహారం కాకరేపుతుందని భావించారు. అయితే ఆ స్ధాయిలో క్షేత్రస్ధాయిలో స్పందన లభించడం లేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో మంత్రులు కూడా రూటుమార్చారు.
ఉత్తరాంధ్రలో రాజధానుల పోరు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల్లో భాగంగా విశాఖకు కార్యనిర్వాహక రాజధాని అంటే అసలు రాజధాని రావాల్సి ఉంది. దీనికోసం మూడేళ్లుగా వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్న వైసీపీ సర్కార్ పంతం నెగ్గించుకోవడంలో విఫలమవుతోంది. దీంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో నమ్మకం సడలిపోతోంది. అదే సమయంలో విశాఖలో వైసీపీ నేతల కబ్జాలు, బెదిరింపులు ఇప్పుడు రాజధానుల వ్యవహారాన్ని పూర్తిగా పట్టాలు తప్పేలా చేస్తున్నాయి. తాజాగా విశాఖలో నాన్-పొలిటికల్ జేఏసీతో వికేంద్రీకరణ గర్జన చేయించిన వైసీపీ.. దాన్ని సొమ్ము చేసుకోవడంలో విఫలమైనట్లు తెలుస్తోంది.
ఫలించని విశాఖ గర్జన ?
విశాఖలో నాన్-పొలిటికల్ జేఏసీ నిర్వహించిన విశాఖ గర్జనకు భారీ ఎత్తున వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, ఇతర ప్రాంతాల మంత్రులు, మాజీ మంత్రులు కూడా తరలివచ్చారు. భారీవర్షాన్ని సైతం లెక్కచేయకుండా గర్జనలో ర్యాలీగా నడిచివెళ్లారు. దీంతో మూడు రాజధానులకు భారీగా స్పందన లభించినట్లు వైసీపీ చెప్పుకుంది. కానీ వాస్తవంలో జరిగింది వేరు. విశాఖ గర్జనతో ఉత్తరాంధ్రలో రాజధానుల పోరును పతాకస్ధాయికి తీసుకెళ్లాలనిభావించిన వైసీపీకి క్షేత్రస్ధాయిలో ఎదురుదెబ్బ తగిలింది. దీని వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి.
ఉత్తరాంధ్రలో ఆశించిన స్పందన కరవు ?
విశాఖ గర్జన తర్వాత ఉత్తరాంధ్రలో జనం రోడ్లపైకి వస్తారని, ఆందోళనలు ఉధృతం చేస్తారని వైసీపీ భావించింది. ముఖ్యంగా విశాఖకు రాజధాని వస్తే ప్రయోజనం పొందే వర్గాలన్నీ ఒకటే తమ పోరుకు మద్దతిస్తారని భావించింది. కానీ అలా జరగలేదు. విశాఖలో రాజధాని రాక వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లభిస్తుందన్న దానిపై ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అవగాహన రాలేదు. ముఖ్యంగా వెనుకబడిన ఈ జిల్లాల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై కాకుండా రాజధాని కోసం ఉద్యమం చేసేందుకు జనం ముందుకు రావడం లేదు.
ఉత్తరాంధ్రపై ధర్మాన అసంతృప్తి
విశాఖ రాజధాని సాధన ఐక్య వేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో జరిగిన సమావేశంలో మంత్రి ధర్మాన ఉత్తరాంధ్ర జనంపై తన అసంతృప్తి వెళ్లగక్కారు. విశాఖను రాజధాన్ని చేయాలని ఉత్తరాంధ్ర జనం ఎందుకు డిమాండ్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర వాసులు ఎందుకు నోరు విప్పడం లేదని, ఎందుకు అంత కష్టంగా ఉందని మంత్రిగారు అడిగారు. జగన్ కు జై కొట్టేందుకు వచ్చిన ఇబ్బందేంటని ధర్మాన ప్రశ్నించారు. ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏదైనా తప్పు చేసిందని మీకు అనిపిస్తే చెప్పండని, సరిదిద్దుకుంటామని ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. కానీ తమ ప్రయత్నానికి మద్దతివ్వాలని కోరారు.
మంత్రుల రాజీనామాస్త్రం వెనుక ?
ఉత్తరాంధ్రలో మూడు రాజధానులకు లభిస్తున్న పేలవ స్పందన మంత్రుల్ని సైతం నిశ్చేష్టుల్ని చేస్తోంది. అమరావతికి మద్దతిస్తారా లేదా అన్నది పక్కనబెడితే.. మూడు రాజధానుల పేరుతో ఉద్యమాలు చేసేందుకు ఉత్తరాంధ్ర జనం సిద్ధంగా లేరనే విషయం క్షేత్రస్ధాయిలో స్పష్టమవుతోంది. దీంతో జనంలో ఉద్యమ వేడి రగిల్చేందుకు మంత్రులు రాజీనామాస్త్రం సంధిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో సీనియర్ మంత్రిగా ఉన్న ధర్మాన పిలుపుకే స్పందన రాకపోవడంతో రాజీనామా లేదా పాదయాత్ర చేపడతామనే లీకులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సొంత ప్రభుత్వంలో రాజీనామాలతో ప్రయోజనం ఉంటుందా లేదా అనే అనుమానం వీరిని వేధిస్తోంది. అన్ని ప్రయత్నాలు విఫలమైతే చివరిగా రాజీనామాలు ప్రయోగించాలనే వాదన వైసీపీలో వినిపిస్తోంది. అయితే ధర్మాన ప్రసాద్ వంటి నాయకులు చేపట్టిన ఉద్యమానికి కిందిస్థాయి నుంచి ముఖ్యంగా విశాఖ ప్రాంతం నుంచి ఎటువంటి స్పందన రావడం లేదు .పైగా అమరావతి నుంచి శ్రీకాకుళం వరకు రైతులు చేస్తున్న మహా పాదయాత్రను అడ్డుకొనేందుకే ఈ కొత్త ఎత్తుగడ అనే భావన ప్రజల్లో ఉంది . అటు విశాఖపట్నం స్టీల్ అమ్మకాన్ని అడ్డుకోలేకపోవడం , విశాఖ రైల్వే జోన్ సాధన పై వైసిపి ఉత్సాహం చూపించకుండా వైసీపీ మూడు రాజధానులు , విశాఖ క్యాపిటల్ అనే అంశానికే పరిమితం కావడం ప్రజలను ఆకట్టుకోలేకపోయింది .