వీర సింహారెడ్డి ఘన విజయం బాలకృష్ణ ది లెజెండ్
బ్లాక్ బస్టర్ మూవీ గా తెలుగు సినిమాలో రికార్డు
నిర్మాణ సంస్థ : మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై రవిశంకర్
దర్శకత్వం : గోపిచంద్ మలినేని
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ
ఎడిటర్: నవీన్ నూలి “అఖండ” ఘన విజయం అనంతరం నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో తెరకెక్కిన చిత్రం “వీరసింహారెడ్డి”. “క్రాక్”తో క్రేజీ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ కూడా మాస్ ఆడియన్స్ కు మంచి ఫీస్ట్ లా ఉంటుందనే ఆశలు రేకెత్తించింది. మరి ఈ ఫ్యాక్షన్ సినిమా ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
సినిమా కి ఫైట్లు, డైలాగ్స్, మ్యూజిక్ ప్రాణం..
కథ: ఇస్తాంబుల్ లో రాయలసీమ వంటకాలు వండే హోటల్ బిజినెస్ మరియు ఆటోమొబైల్ బిజినెస్ చేస్తూ.. తల్లితో(హాని రోజ్ )కలిసి సంతోషంగా బ్రతుకుతుంటాడు జయ సింహా రెడ్డి (బాలకృష్ణ). తొలిచూపులోనే ఇష్టపడిన ఈష (శ్రుతిహాసన్) తల్లిదండ్రులతో పెళ్లి సంబంధం మాట్లాడడం కోసం కర్నూలు లోని పులిచర్ల గ్రామ పెద్ద, తండ్రి అయిన వీర సింహా రెడ్డి (రెండో బాలకృష్ణ) ఇస్తాంబుల్ కి ఫోన్ చేసి పిలస్తుంది హాని రోజు నీకు నాన్న ఉన్నారు పులిచర్ల లో అని,అప్పుడు వాళ్ళు నాన్న గురించి చెబుతుంది ఫ్లాష్ బ్యాక్,.పక్కన ఉన్న ముసలి మడుగు లో ప్రతాప్ రెడ్డి వాళ్ళు అరాచకాలు ఎక్కువ అవుతాయి.. ఒక పిల్లవాడు పులిచర్ల వచ్చి వీర సింహ రెడ్డి కివాళ్ళు అమ్మ నాన్న ని అన్యాయం గా చంపారు అని చెబుతాడు అక్కడ గుడి జాతర జరగదు అప్పుడు దేవుడు వచ్చాడు జాతర జరపండి అని చెబితే అడ్డుపడతాడు ప్రతాప్ రెడ్డి వాళ్ళు నాన్న అప్పుడు వీర సింహ ప్రతాప్ రెడ్డి వాళ్ళు నాన్న ని అతని కత్తి తోటి చంపేస్తాడు. ప్రతాప్ రెడ్డి కి పగ పెంచుకొంటాడు వీర సింహ మీద ..అక్కడ మురళి శర్మ కూతురు శృతి తోటి జయ సింహ పెళ్లి ఒప్పుకుంటాడు కానీ మురళి శర్మ సీమ లో ఫ్యాక్టరీ పెట్టడానికి దునియా విజయ్ కి డబ్బులు ఇస్తాడు. కానీ పని అవ్వదు. అక్కడ మురళి శర్మ వీరసింహ రెడ్డి ని చూస్తాడు. అతను ఫోన్ చేసి అక్కడ కి పిలుస్తారు విజయ్ ని వీర సింహ ని చంపడానికి. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా వచ్చి వీర సింహ రెడ్డి ని చంపుతుంది.ఫ్లాష్ బ్యాక్ లో సిద్దప్ప కధ గురించి జయ సింహ కి చెబుతాడు.వరలక్ష్మి విరసింహ రెడ్డి సవితి తల్లి కూతురు. వరలక్ష్మి ప్రేమించిన అబ్బయి బాలకృష్ణ పది మంది లో కొట్టిన అందుకే ఊరిసుకొని చనిపోయారు అని కక్ష పెంచుకొని ఇంటి లో నుంచి వెళ్లి పోయి దునియా విజయ్ తోటి తాళి కట్టించుకొని తన అన్నని చంపినంతర్వాత మాత్రమే తనతోటి కాపరం చేస్తాను అని చెబుతుంది. అక్కడ దునియా విజయ్ చెబుతాడు తను వరలక్ష్మి లవర్ ని చంపి ఊరివేశాను అని. అప్పుడు జయ సింహ దగ్గర కి వచ్చి విషయం అంత చెప్పి తనని క్షమించు అని అడిగి కత్తి తోటి పొడుచుకొని చనిపోతుంది సినిమా కి ప్రాణం ఈ సిన్. లేడీ సెంటిమెంట్.. జయ సింహ ప్రతాప్ రెడ్డి ని చంపడం జరుగుతుంది కధ ముగుస్తుంది.
పోరెళ్ల. సాంబశివరావు
సినీ ఎనలిస్ట్