నేటి రాశి ఫలాలు డిసెంబర్ 27
Dec 27, 2022, 05:21 IST
|
*శుభోదయం*
ఈ రోజు పుట్టిన రోజు, పెళ్ళిరోజు, ఇంకేమైనా విశేష రోజు జరుపుకొంటున్న మిత్రులకి, శ్రేయోభిలాశులకి, ఆత్మీయులకి, మరియు వారి కుటుంబసభ్యులకు,
*శుభమస్తు*
*27-12-2022* నాటి
*ద్వాదశ రాశుల* వారికి *మంగళవారం* (భౌమవాసరే) ఫలాలూ!
*మేషం*
విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధనసాయం అందుతుంది. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారములో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.
*వృషభం*
ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు.
*మిధునం*
ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి.
*కర్కాటకం*
చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. వ్యాపారమునకు సకాలంలో పెట్టుబడులు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ బాధ్యతలు మరింత పెరుగుతాయి.
*సింహం*
సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహన లాభాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యాపార వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది.
*కన్య*
వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.
*తుల*
ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబసభ్యులతో వివాదాలు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. ఇంటాబయట చికాకులు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.
*వృశ్చికం*
ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఇంటాబయట బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు.
*ధనస్సు*
భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు.
*మకరం*
ఆరోగ్యం మందగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి.
*కుంభం*
నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరణకు తీసుకున్న నిర్ణయాలు కలసి వస్తాయి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి.
*మీనం*
చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. దాయదులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.
*శుభాకాంక్షలు*
శుభం భవతు, సన్మంగలని సంతు,
ఇష్ట, కమ్యర్త్త ఫల సిద్ధిరస్తు,.
మానోవంచా ఫల సిద్ధిరస్తు,
ఇష్టదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు
*లోకా సమస్తా సుఖినో భవతు*