వివేకా హత్య కేసు విచారణ నేడు సుప్రీం కోర్టులోనే
సునీత ఆరోపణలు నిజమే :సిబిఐ
Updated: Oct 18, 2022, 20:53 IST
|
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారణను వీరు రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన కుమార్తె సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై రేపు విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది .సునీతా రెడ్డి లేవనెత్తిన అంశాల్ని వాస్తవమేనని ఆంధ్రప్రదేశ్లో దర్యాప్తు చేయడానికి పోలీసులు సహకరించడం లేదని సీబీఐ తన పిటిషన్లో పేర్కొంది .సాక్షులను బెదిరిస్తున్నారని ఆధారాలు లేకుండా చేస్తున్నారని సునీతారెడ్డి ప్రస్తావనను సీబీఐ సమర్థించింది .విచారణ జాప్యం జరగడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ కారణమని పైగా కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులపై నిందితులపై కేసులు వేస్తున్నారని సీబీఐ ఆరోపించింది .