home page

విశాఖకు ద్రోహం చేసిన కసాయి

జనసేన మూర్తియాదవ్ ఆరోపణ  

 | 
murthy

జగన్ కి ద్రోహం చేసిన విజయసాయి  

విజయసాయి కాదు విశాఖ కసాయి


కొత్త ప్రాజెక్టులు, పథకాలతో విశాఖ కు వరాలిచ్చే సాయి కాదు, భూకబ్జా లు, ఆక్రమణలతో విశాఖ గొంతు కోస్తున్న కసాయి 


విజయసాయిరెడ్డి,  ఎం వి వి, జీవీ ల భారీ భూకబ్జాల నుంచి విశాఖ ను కాపాడండి

విజయసాయి ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా వచ్చిన తర్వాతే గా కుమార్తె నేహా రెడ్డి  అన్ని  ఆస్తులు కొనుగోలు చేసింది

చంద్రబాబుకు చెందిన సామాజిక వర్గం విశాఖలో 70 శాతం ఆస్తులు కొనుగోలు చేస్తే వారితో అభివృద్ధి ఒప్పందం ఎందుకు తీసుకున్నారు?

విజయ సాయి కి దమ్ముంటే ఎం వి వి ఒక శాతం అభివృద్ధి ఒప్పందాన్ని బయటపెట్టగలరా? అనుమతులు లేని హైయగ్రీవ  ఆపగలరా?


 ఎం వీ వీ విశాఖ ఎంపీ గా వచ్చిన తర్వాత విజయసాయి ఉత్తరాంధ్ర  ఇన్చార్జిగా నియమితులైన తరువాతే  విశాఖలో కనీవినీ ఎరుగని వేలకోట్ల భూ కుంభకోణాలు


వీటన్నిటి పై సిబిఐ , ఈ డీ లతో సమగ్ర విచారణ జరిపించాలి

విశాఖలో తనకు ఒక ఇల్లు తప్ప గజం స్థలం కూడా లేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్న రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి నిజంగా నిజాయితీపరుడు అయితే మూడేళ్లలో విశాఖలో జరిగిన భూకబ్జాలు కుంభకోణాలపై సీబీఐ ఈడీ విచారణకు సిద్ధం కావాలి. ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా కార్యకర్తల సంక్షేమ, పార్టీ అభివృద్ధి కోసం కాక కేవలం భూకబ్జాలు, డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టిన విజయసాయిరెడ్డి పార్టీని భ్రష్టు పట్టించారు.  విజయ్ సాయి పై భారీ భూ కబ్జా ఆరోపణలు వస్తే వైఎస్సార్ కాంగ్రెస్  నుంచి ఒక్క నాయకుడు కూడా తనకు మద్దతుగా ముందుకు రాలేదంటే పార్టీలో ,ప్రభుత్వంలో  ఆయన దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  కుమార్తె కంపెనీ పేరిట జరిగిన వందల కోట్ల రూపాయల విలువ చేసే భూముల రిజిస్ట్రేషన్ లకు,  వేల కోట్ల విలువచేసే తన బినామీల దసపల్లా  ఒప్పందాలకు తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పే విజయసాయిరెడ్డి వీటిపై  సమగ్ర విచారణకు సిద్ధంగా ఉన్నారా? విజయసాయిరెడ్డి విశాఖ రాకముందు ఆయన కుమార్తె అల్లుడు ఈ ప్రాంతంలో ఎందుకు పెద్ద ఎత్తున భూ లావాదేవీలు జరపలేదు?  వ్యాపారాలు చేయలేదు.? ఆయన ప్రమేయం లేకుండా ఆయన మద్దతు లేకుండా ఆయన ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా ఉన్న సమయంలోనే ఎందుకు వందల కోట్ల రూపాయల లావాదేవీలు  చేయగలిగారు?.  కుమార్తె అల్లుడికి విశాఖ లో  వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టి వాస్తవాలను కప్పిపుచ్చి విజయసాయి చెప్పే కల్లబొల్లి కబుర్లు విశాఖ వాసులు నమ్మే పరిస్థితిలో లేరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాడిసన్ హోటల్ వాటాలుఎందుకు మారాయి ? బేపార్క్ హోటల్లో కొత్త భాగస్వాములు ఎందుకు వచ్చి చేరారు?  ఎన్నో ఏళ్లుగా వివాదంగా ఉన్న  మధురవాడ లోని 70 ఎకరాల ఎన్  సి సీ భూముల సెటిల్మెంట్, అనుమతులు ఎలా  జరిగాయి. ? 50 ఎకరాల రేడియంట్  భూముల డెవలపర్ గా మరో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నుంచి వచ్చి ఎందుకు చేరారు? ఎంతో కాలంగా వివాదం లో ఉన్న హైయగ్రీవ  భూముల్లో ఎటువంటి అనుమతులు లేకుండా పనులు ఎలా  జరుగుతున్నాయి? సహచర ఎంపీ ఎం వీ వీ  సత్యనారాయణ భూ యజమానులకు ఒక శాతం ఇచ్చి తాను 99% ఉంచుకొని అత్యంత విలువైన కూర్మనపాలెంలోని పది ఎకరాల్లో భారీ భవన సముదాయాలు ఎలా నిర్మిస్తున్నారు.?వి ఎం ఆర్ డి ఎ మాస్టర్ ప్లాన్ రోడ్లో వేలాది కోట్ల రూపాయల భూములు  ఎలా అధికార పార్టీ నేతలు , వారి బంధువుల వశమయ్యాయి? వీటిపై మరో విచారణ కమిటీ ని నియమించాలి.

వీటన్నిటికీ విజయసాయిరెడ్డి సూత్రధారి అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా తనకు ఏమీ తెలియదని  అమాయకపు మాటలు మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా ఉండగా కీలకమైన ఎమ్మార్వో కార్యాలయాల్లో పట్టాదారు పాస్ పుస్తకం కావాలన్నా ఆయన అనుమతి అవసరం అయ్యే ది.  22 ఏ లో వున్న  భూముల్ని  తొలగించాలన్న ఆయనకు తెలియకుండా జరిగేది కాదు. క్రింది స్థాయి వైకాపా కార్యకర్తలకే  కాదు సామాన్యులు కూడా ఎన్ని తెలుసు. మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు సైతం ఈ పనులు కోసం విజయం సాయి చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు.  అయినా తనకు ఏమీ తెలియనట్టు తాను నిజాయితీ కి నిలువెత్తు అద్దం అన్నట్టు విజయసాయి బిల్డప్ ఇవ్వటం పార్టీ నేతలను, ప్రభుత్వ  అధికారులు లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

 వేలకోట్ల ఆస్తుల సంపాదనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో  నెంబర్ టూ గా చెలామణీ అయిన విజయసాయిరెడ్డి ఇప్పుడు ఒంటరి  అయిపోయారు. కబ్జాల  కారణంగానే ఉత్తరాంధ్ర ఇన్చార్జి పదవి కూడా పోయింది. తన మీద ఆరోపణలు వస్తే చివరికి తానే స్వయంగా విశాఖ వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితిలో విజయసాయిరెడ్డి ప్రస్తుతం ఉన్నారు. ఈ వాస్తవాలను పక్కనపెట్టి తానేదో నిజాయితీపరుడునని చెప్పుకోవడం నిజంగా విడ్డూరమే.  ఆయన చెప్పినట్లే ఒకే సామాజిక వర్గానికి చెందిన 70 శాతం మందికి విశాఖలో భూములు ఉంటే, వారే  దసపల్లా   22 ఏ బాధితులు అయితే విజయసాయిరెడ్డి వారికోసమే ఎందుకు  పని చేశారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన  బాడా బాబులు కోసం విజయ సాయి పని చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి కి విద్రోహం  చేయటమే కదా.  22 ఏ బాధితులైన వేలాది మంది సామాన్య మధ్యతరగతి ప్రజలకు లభించని  రిలీఫ్ విజయసాయిరెడ్డి కారణంగా చంద్రబాబు సామాజిక వర్గానికే  లభించింది కదా. మరి  వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు దీనికేం సమాధానం చెబుతారో చూడాలి. పార్టీ తో , కార్యకర్తలతో  సంబంధం లేకుండా వేల కోట్ల రూపాయలకు అధిపతి కావడమే విజయసాయి రెడ్డి ఏకైక లక్ష్యం. అందుకే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్నవారితో విశాఖలో అంటకాగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తల ను దూరం పెట్టి భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్ లతో చేతులు కలిపి  చివరికి అభాసు పాలయ్యారు. డబ్బు కోసం భూమి కోసం ఇతర పార్టీల నాయకులతో కుమ్మక్కైన విజయసాయి పై  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా విచారణ జరిపించి  వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలి. విజయసాయి కుంభకోణాలకు కీలకంగా మారిన గత ప్రభుత్వ ప్రస్తుత ప్రభుత్వం  సిట్  నివేదికలను బహిర్గతం చేయాలి. ఇప్పటికైనా జరిగిన తప్పును సరిదిద్దు కోని  దసపల్లా  నుంచి హైయగ్రీవ  వరకు భూములన్ని ప్రభుత్వానికి అప్పగిస్తే కొంతమేరకైనా నష్ట నివారణ చర్యలు తీసుకున్న వారవుతారు.  కలెక్టర్ ఎన్వోసీ లేకుండా జరుగుతున్న హైయగ్రీవ  పనులను వెంటనే ఆపివేయాలి. విశాఖ ఎంపీ ఎం వి వీ  సత్యనారాయణ భూ యజమానులకు ఒక శాతం వాటా మాత్రమే ఇచ్చి  చేస్తున్న కూర్మన్నపాలెం ప్రాజెక్టు ను తక్షణమే నిలిపివేసే సమగ్ర విచారణ జరపాలి. తనపై వచ్చిన ఆరోపణలు సమాధానం చెప్పకుండా వార్తలు రాసిన విలేకరులను పత్రికలను, మీడియ ను  తిట్టడం వేదాలూ వల్లించటం వళ్ల  జరిగేది ఒరిగేది ఏమీ ఉండదు. విజయసాయి చెప్పినట్టే ఒక పత్రిక అధిపతి పేరు చివర జీ అనే అక్షరం తీసే కంటే విజయ్ సాయి లో సాయి  ముందు క అనే అక్షరం చేర్చి  ఆయనను  కసాయిగా  సంబోధించడం సమంజసమేమో.  విశాఖకు ద్రోహం చేసిన కసాయిగా ఆయన చరిత్రలో  మిగిలిపోతారు.