home page

అమరావతి కేసుపై సుప్రీంలో నవంబరు ఒకటిన విచారణ

స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు ఏపీ 

 | 
Supreme court

హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం అప్పీల్  

*న్యూఢిల్లీ/అమరావతి (సుప్రీంకోర్టు)*

_*ఏపీ రాజధాని అమరావతిపై నవంబర్ 1న సుప్రీంకోర్టులో విచారణ*_

*ఏపీకి అమరావతే రాజధాని అంటూ తీర్పు ఇచ్చిన హైకోర్టు*

*- హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం*

*- తమ పిటిషన్ పై త్వరితగతిన విచారణ చేపట్టాలంటూ సీజేఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ*

*- సీజేఐ ఆదేశాలతో పిటిషన్ ను లిస్ట్ చేసిన కోర్టు రిజిస్ట్రీ*

★ ఏపీ రాజదాని అమరావతికి సంబంధించిన వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. 

★ నవంబర్ 1న అమరావతిపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణను చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. 

★ ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ఆదేశాల మేరకు అమరావతిపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను నవంబర్ 1న లిస్ట్ చేస్తూ కోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. 

★ ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఇటీవలే ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

★ అంతేకాకుండా 6 నెలల్లోగా అమరావతిని అభివృద్ధి చేసి తీరాలని కూడా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 

★ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును గత నెలలో ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

★ ఈ పిటిషన్ పై త్వరితగతిన విచారణ జరిగేలా చూడాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సీజేఐ జస్టిస్ లలిత్ కు లేఖ కూడా రాసింది. 

★ ఈ క్రమంలోనే ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణకు అనుమతి మంజూరు చేయడంతో పాటుగా విచారణ తేదీని కూడా ప్రకటించింది. 

★ ఈ పిటిషన్ పై జరిగే విచారణలో తమ వాదనలు కూడా వినాలని రాజధాని రైతులు కేవియట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.