అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు :సుప్రీం ఆదేశం

*న్యూఢిల్లీ (సుప్రీంకోర్టు)*
_*ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు*_
*ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం తీర్పును వెలువరించింది.*
*- కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ధర్మాసనంలోని నలుగురు సభ్యులు సమర్థించారు.*
★ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 10 శాతం కోటా(రిజర్వేషన్లు) కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
★ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది.
★ ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.
★ ఐదుగురు న్యాయమూర్తుల్లో నలుగురు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్ధించారు.
★ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ త్రివేది, జస్టిస్ పార్దీవాలాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించింది.
★ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అనేక మంది సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు.
★ ఈ కేసుకు సంబంధించి ప్రధాన వ్యాజ్యాన్ని 'జనహిత్ అభియాన్' అనే సంస్థ 2019లో దాఖలు చేసింది.
★ 103వ సవరణ.. రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చేస్తోందని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
★ వీటితో పాటు సుమారు 40 వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
★ ఉన్నత వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
★ ఈ చట్టం 2019, ఫిబ్రవరి 1న అమలులోకి వచ్చింది.
★ ఫలితంగా వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణ పేదలకు లబ్ధి చేకూరనుంది.