home page

రాజధానిపై ఇన్ని పిల్లి మొగ్గలా?

 | 

జకీయాలు చెడిపోయానని జగన్మోహన్ రెడ్డి తరచూ బాధపడుతూంటారు. ఆయనను చూసి సామాన్యులు కూడా బాధపడుతున్నారు. ఇంత దారుణంగా రాజ్యాంగ వ్యవస్థల అభిశంసనకు గురై..అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న ఏపీ ప్రభుత్వ పెద్దలు ఏ మాత్రం సిగ్గుపడకుండా ఇంకా పదవిలో ఎలా కొనసాగుతున్నారన్నదే చాలా మందికి ఆశ్చర్యం వేస్తోంది.

అసలు తమకేమీ సంబంధం లేదన్నట్లుగా వారు దులిపేసుకుంటున్న వైనం .. నిశ్చేష్టుల్ని చేస్తోంది. పైగా.. అది తమకు సంతోషం అంటూ కల్లిబొల్లి కబుర్లు చెప్పి. అమాయకత్వం నటిస్తున్నారు.

సొంత బాబాయి హత్యకేసులో నిందితులకు అండగా ఉండే సీఎం !

ఓ ముఖ్యమంత్రి బాబాయి హత్యకేసులో నిందితుల్ని కాపాడటానికి ప్రయత్నించడమా? ఇంత దారుణమైన పరిస్థితి స్వతంత్ర ప్రజాస్వామ్య భారతంలో ఎప్పుడూ ఉండదు. ఆ స్థానంలో ఉన్న వారు అలా ఆలోచించకూడదు. కానీ సీఎం జగన్ ఆలోచించారు. ఆయన తీరు ఎలా ఉందంటే. నిందితుల్ని కాపాడటానికి .. వైఎస్ వివేకా కుమార్తె , సోదరిపై నిందలు వేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఆయన ప్రేమేయం లేకుండా వివేకా కేసులో పరిణామాలు జరిగాయని అనుకునే చాన్స్ లేదు.

ప్రతీ విషయంలో యూటర్న్‌లే - చేయకపోతే చెబుతున్నామంటూ అడ్డగోలు వాదన !

ఒక్క వివేకా కేసు మాత్రమే కాదు.. విపక్షంలో ఉన్నప్పుడు తాను ఏం చెప్పాలో అన్నీ రివర్స్‌లో చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో చేసిన వాటిలోనే మరింత ఎక్కువగా చేస్తున్నారు. విద్యుత్ ఒప్పందాలు పాతికేళ్లకు ఒప్పందం చేసుకోవడం అవినీతి అని చెప్పి తాను ముఫ్పై ఏళ్లకు చేసుకున్నారు. టీడీపీ హయాంలో అంతర్జాతీయ సంస్థలు వస్తే.. జగన్ హయాంలో ఆయన బంధువుల కంపెనీలే వచ్చాయి. విద్యుత్ ఒప్పందాల దగ్గర్నుంచి ప్రారంభించి ప్రతీ విషయంలోనూ అదే తంతు. బోగాపురం ఎయిర్ పోర్టు కాంట్రాక్ట్ జీఎంఆర్‌కి ఇస్తే. రద్దు చేసి మళ్లీ జీఎంఆర్‌కే ఇచ్చారు. ఇలాంటివి లెక్కలేస్తే వందల్లో ఉంటాయి. అయినా సిగ్గుపడటం లేదు. ఇక సీపీఎస్ రద్దు, ప్రత్యేకహోదా వంటి విషయాల్లో నిర్వాకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా చేయలేకపోతే చెబుతున్నామంటూ వితండవాదం ఒకటి.

ఆర్థికంగా ఏపీ ఊపిరిని నొక్కేసినా. షిక్కని చిరునవ్వులే !

ఇక ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును పూర్తిగా పడుకోబెట్టేశారు. శరవేగంగా సాగుతున్న నిర్మాణాన్ని కాంట్రాక్టర్‌ను మార్చడం ద్వారా నాశనం చేసేశారు. ఇప్పుడా ప్రాజెక్టును ఎత్తిపోతలకు పరిమితం చేసే ఆలోచన చేస్తున్నారు. ఇక అమరావతి ని నిలిపివేసి మూడు రాజధాలనుల పేరుతో ఏపీ ఆర్థిక పునాదుల్ని కూల్చేశారు. పొరుగు రాష్ట్రాలు అన్నీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు.. పరిశ్రమల ఆకర్షణలో దూసుకెళ్తూంటే.. ఏపీని నాకించేసి. ప్రతీ ఇంటికి డబ్బులిస్తున్నా.. ముఫ్పై ఏళ్ల పాలన చేస్తానంటూ బయలుదేరుతున్నారు.

రాజకీయాలు చెడిపోవడమంటే ఇదే !

నిర్ణయాల్లో యూటర్న్‌లు.. న్యాయస్థానాల్లో అభిశంసనలు ఎదుర్కొన్నా. ఏ మత్రం తొణకకుండా.. తప్పు చేస్తున్నామని అనుకోకుండా.. సిగ్గు లేకుండా ఇంకా పాలన చేస్తున్నారు. ఇదే రాజకీయం చెడిపోవడం అంటే !