home page

ఏపీకి వర్ష సూచన

అల్పపీడన ద్రోణి ప్రభావం  

 | 
AP

*_బలపడుతున్న అల్పపీడనం ఏపీకి వర్ష సూచన_*

_నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా బలపడుతుంది. ఈ ప్రభావంతో *ఆంధ్రప్రదేశ్‌లోని* పలు ప్రాంతాల్లో *భారీ వర్షాలు* కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది._

_అలాగే చెన్నై నగరంతో పాటు *తమిళనాడు* లోని పలు ప్రాంతాల్లో 
 *భారీ నుంచి అతిభారీ వర్షాలు* కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం పరిసరాల్లో 7.6 కి.మీ వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని.. రాగల 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడనం ఈనెల 12 లోగా తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం చేరుకునే అవకాశముందని తెలిపింది._

 నవంబర్ 12 వరకు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం నగరంలో కూడా నవంబర్ 11, 12 తేదీలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది...!!_