home page

ప్రజారాజ్యం నేతలపై పవన్ కన్ను

జనసేన బలోపేతం లక్ష్యంగా ప్రణాళికలు 

 | 
Prajarajyam leaders

ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన బలం,బలగం పెంచుకోవాలి 

వచ్చే నెల నుంచి జనాల్లోకి వచ్చేందుకు పవన్ తన ప్రచార రథాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. ఇక ఏపీ అంతట బస్సు యాత్ర నిర్వహించి ప్రజల్లో బలం పెంచుకునేందుకు జనసేన అధినేత సిద్ధం అవుతున్నారు. దీంతో పాటు తమకు ఎక్కువ స్థానాలు దక్కుతాయని భావిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పై పవన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ జిల్లాలో మెజార్టీ స్థాయిలో సీట్లను దక్కించుకుంటే కింగ్ మేకర్ కావచ్చనే లక్ష్యంతో పవన్ ఉన్నారు. మొత్తంగా ఉన్న 19 నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలను దర్శించుకుంటే తమకు తిరుగుండదని పవన్ భావిస్తున్నారు. దీంతో గతంలో తన అన్న స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా పనిచేసిన నాయకులందరినీ జనసేన వైపు తీసుకొచ్చే వ్యూహానికి తెర తీశారు. ఉమ్మడి తూర్పుగోదావరి లో ఉన్న 19 స్థానాల్లో నాలుగు చోట్ల ప్రజారాజ్యం అప్పట్లో గెలిచింది. ఎనిమిది చోట్ల రెండవ స్థానంలో నిలిచింది. ఐదు చోట్ల మెజార్టీ ఓట్లను చీల్చగలిగింది. ఇప్పుడు ఆ బలాన్ని ఉపయోగించుకుని జనసేనకు వీలైనన్ని ఎక్కువ సీట్లు వచ్చేలా చేసుకునేందుకు పవన్ గతంలో ప్రజారాజ్యంలో యాక్టివ్ గా పని చేసిన వారందరిని జనసేన వైపు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో చిరంజీవి విలీనం చేసిన తర్వాత చాలామంది వివిధ పార్టీల్లో చేరిపోయారు. ఇందులో వైసీపీలోనూ కీలక పదవుల్లో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు. అయితే వైసిపి మినహా మిగిలిన వారందరినీ జనసేన వైపు తీసుకొస్తే తమకు తిరిగి ఉండదని పవన్ లెక్కలు వేసుకుంటున్నారట.

ఈ మేరకు గతంలో యాక్టివ్ గా ఉన్న నాయకుల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు వారు ఏ పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు ? వారు జనసేన వైపుకు వచ్చే అవకాశం ఉందా ? ఉంటే వారి బలం ఏ స్థాయిలో ఉంది ఇలా అనేక అంశాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి తూర్పుగోదావరి తో పాటు, రాయలసీమ , ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోనూ గతంలో ప్రజారాజ్యంలో యాక్టివ్ గా ఉన్న నేతల లిస్టును పవన్ తెప్పించుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా జనసేన ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు మాజీ ప్రజారాజ్యం నేతలను ఉపయోగించుకోవాలని పవన్ ఆలోచన చేసినట్టుగా కనిపిస్తున్నారు.