పవన్ ఇప్పుడు తాడేపల్లి పోలీస్ దృష్టిలో ఏ 1
జనసేనానిపై కేసు నమోదు - ఇక పవన్ కూడా ఏ-1
పవన్ ఇప్పుడు తాడేపల్లి పోలీస్ దృష్టిలో ఏ 1
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేసు నమోదైంది. తాడేపల్లి పోలీసులు ఆయనను ఏ వన్‌గా పెట్టి.. ఆయన కారు డ్రైవర్‌ను ఏ 2గా ఖరారు చేసి కేసు నమోదు చేశారు.
పవన్ కల్యాణ్ వల్ల తనకు బైక్ ప్రమాదం జరిగిందని తెనాలి మోరిస్ పేటకు చెందిన పి. శివ అనే వ్యక్తి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.
తెనాలి మోరిస్ పేటకు చెందిన శివ అనే వ్యక్తి నవంబర్ 5వ తేదీన ఇప్పటం రోడ్ మీద వెళ్తున్న సమయంలో పవన్ కల్యాణ్ కాన్వాయ్ వేగంగా వచ్చింది. ఆ కాన్వాయ్‌లో మొదటి కారుపై వన్ కల్యాణ్‌పై కూర్చుని ఉన్నారు. ఆ కారును అమిత వేగంతో డ్రైవర్ నడిపించారు. అదే వేగంతో చాలా కార్లు వెళ్లాయి. ఈ కారణంగా అదే రోడ్డుపై బైక్‌పై వెళ్తున్న పి.శిన అనే వ్యక్తి స్కిడ్ అయి కిందపడిపోయాడు. తన ప్రమాదానికి కారణం పవన్ కల్యాణ్, అతని డ్రైవరేనని అతని పదో తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకుక కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్.. ప్రధాని ఏపీ పర్యటనన నుంచి తెలంగాణకు బయలుదేరి వెళ్లిన తర్వాత బయటకు వచ్చింది.
ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ అక్కడి ప్రజలకు అండగా ఉండేందుకు ఐదో తేదీన పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామానికి వెళ్లారు. మొదట ఆయన వాహనాలతో వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. అయితే పవన్ నడుచుకూంటూ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొంత దూరం పోయిన తర్వాత పోలీసులు వాహనాలకు అనుమతి ఇచ్చారు. అప్పుడు పవన్.. కారుపైకి ఎక్కి కూర్చుని వెళ్లారు. అమితమైన వేగంతకో వెళ్లలేదు. పైన పవన్ కూర్చున్నందున మెల్లగానే వెళ్లారు. ఈ దృశ్యాలను వైఎస్ఆర్‌సీపీ వివాదం చేసింది. తమ పలుకుబడి ఉపయోగించి.. జాతీయ మీడియాలోనూ చూపించుకున్నారు. ఎవరూ పట్టించుకోలేదు. అయితే అలా చేయడం వల్ల తాను కిందపడ్డానంటూ అసంబద్ధంగాఉండే ఓ ఫిర్యాదును ఏ ఆధారాల్లేకుండా స్వీకరించి.. కేసు పెట్టేశారు.బహుశా.. ఏ ఆర్థరాత్రో పవన్ కల్యాణ్‌ను అరెస్ట్ చేయడానికి వందల మందిని పంపిస్తారేమో వెయిట్ చేయాలి.