కట్టలు తెంచుకున్న పవన్ ఆగ్రహం
చెప్పుతో కొడతా : పవన్ ఆగ్రహం

నను
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికార పార్టీపై చేసే విమర్శల డోసును మరింతగా పెంచారు. వైఎస్ఆర్ సీపీ నేతలను ''కొడకల్లారా?, వెధవల్లారా?, సన్నాసుల్లారా?'' అంటూ పదే పదే ఈ విపరీతమైన పదజాలం వాడుతూ దూషించారు.
ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఆ సమయంలో తన కాలి చెప్పు పైకి తీసి చూపుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నా విడాకులు ఇచ్చి, వారికి తన ఆస్తులు కూడా ఇచ్చి మరొకర్ని పెళ్లి చేసుకున్నానని అన్నారు. వైఎస్ఆర్ సీపీ నాయకుల మాదిరిగా ఒకర్ని పెళ్లి చేసుకొని 30 మందితో తిరగడం లేదని అన్నారు. 'వెధవల్లారా ఒక్కొక్కడ్ని ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చి కొడతా' అని తీవ్రమైన పదజాలంతో దూషించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం (అక్టోబర్ 18) పవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రసంగం మొదటి నుంచి చివరి వరకూ పరుష పదజాలం వాడుతూ వైఎస్ఆర్ సీపీ నేతలపై విరుచుకుపడ్డారు.
''నాకు రాజకీయం తెలియనుకుంటున్నారా? ఒక్కొక్కర్నీ నిలబెట్టి తోలు ఒలుస్తా, చెప్పుతో కొడతా కొడకల్లారా!'' అంటూ పవన్ కల్యాణ్ మరో స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా అందరూ పవన్ కల్యాణ్ లోని మంచితనాన్నే చూశారని, ఇకపై తన నుంచి తమ నుంచి యుద్ధమే చూస్తారని తేల్చి చెప్పారు. ఈ స్ఫూర్తి తనకు తెలంగాణ పోరాటం నుంచి వచ్చిందని చెప్పారు. తన తండ్రి కూడా అప్పట్లో మంగళగిరి పోలీస్ స్టేషన్‌లోనే కానిస్టేబుల్ గా పని చేశారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ సీపీ నేతలకు మంచిగా చెప్తే వినపడదని అన్నారు.