home page

అసైన్మెంట్ భూమి హక్కుల బదలాయింపు పై చర్చలు

 | 
Dharmana
 అసైన్మెంట్ భూములకు బదలాయింపు హక్కులు కల్పించుటకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖామాత్యుల వారి అధ్యక్షతన,పురపాలక,సాంఘిక సంక్షేమశాల మంత్రులు,పలువురు శాసన సభ్యులతో కూడిన కమిటీ మంగళవారం బెంగుళూరులో కర్ణాటక రాష్ట్ర రెవెన్యూ శాఖామాత్యులతో సమావేశమైంది.కర్ణాటక రాష్ట్రంలో అమలులో ఉన్న అసైన్డ్ భూములకు సంబంధం ఉన్న చట్టo, వాటి విధానాలను అధ్యయనం చేయడం జరిగినది.అసైన్డ్ భూములకు బదలాయింపు హక్కులు కల్పించడం వలన సదరు భూములు పొందిన రైతుల సామాజిక, ఆర్ధిక స్థితి గతులలో సంభవించిన మార్పులను గమనిoచడం జరిగిoది.
2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసైన్డ్ భూముల (బదిలీ నిషేధం) చట్టం,1977(సంక్షిప్తంగా 9/77) చట్టం అసైన్డ్ భూములను బదిలీ చేయడాన్ని జీవిత కాలం నిషేధం విధించబడినందున సదరు రైతులు సాధారణ రైతులకు కలుగు ప్రయోజనాలు పొందలేకపోతున్నారు.ఈ విషయoలో కర్ణాటక రాష్ట్రoలో అములులో యున్న అన్నిరకముల మార్గదర్శకాలను పరిశీలించి మెరుగైన విధానములను అవలంభించుటకు అసైన్డ్ భూముల (బదిలీ నిషేధం)చట్టం, 1977 నకు తగు సవరణలు చేయవలసిన ఆవశ్యకత ఉన్నదా/లేదా మరియు అక్కడ యున్న విధి విధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగినది .
3. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావుతో పాటు రాష్ట్ర పురపాలక శాఖామాత్యులు ఆదిమూలపు సురేష్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు మేరుగు నాగార్జున, శాసన సభ్యులు జొన్నలగడ్డ పద్మావతి పాల్గొనగా ఈసమావేశంలో కర్ణాటక రాష్ట్ర రెవెన్యూ శాఖామాత్యులు ఆర్.అశోక,కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవిన్యూ శాఖా ఉన్నతాధికార్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.