home page

ముస్లిం జనాభా ఇండియా లో.60, కోట్లు పైనే,!

ముస్లిం దేశాల్లో 44 కోట్లు మాత్రమే!!

 | 
Masjid
ముస్లింల జనాభా అరబ్ దేశాల్లో 44 కోట్లయితే, భారత ఉపఖండంలో 60 కోట్లు
.................................
1947లో పాకిస్తాన్ పుట్టకపోతే " అఖండ భారతదేశం " లో నేడు 180 కోట్ల జనాభా ఉండేది. పాక్, బంగ్లాదేశ్ అంతర్భాగంగా ఉండే 'అవిభక్త భారతం'లోని  మొత్తం జనాభాలో దాదాపు 60 కోట్ల మంది ముస్లింలు ఉండేవారు. అప్పుడు ముస్లింలకు ఢిల్లీ సర్కారుతో గట్టిగా బేరమాడే శక్తియుక్తులు ఉండేవి. బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ కన్నా కాస్త నాణ్యత గల ముస్లిం నాయకులు దూకుడు లేకుండా నింపాదిగా రాజకీయాలు నడిపేవారు. వారికి అసద్ భాయ్ మాదిరిగా కాషాయ శిబిరంలో రాష్ట సంబంధాలు కలిగి ఉండాల్సిన అవసరం లేక పోయేది. ఇస్లాం అనుసరించే భారతీయుల జనాభా మొత్తం జనసంఖ్యలో మూడో వంతు (60 కోట్లు) ఉన్నా గాని నితీశ్ కుమార్, పినరయి విజయన్, ములాయం, లాలూ ప్రసాద్, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ వంటి హిందూ నాయకుల వెంటే ఎక్కువ మంది ముస్లింలు నడిచేవారు. మొత్తం మీద భారత ముస్లింలు ఇప్పటి కన్నా మెరుగ్గా ఉండేవారు. ఈ ముస్లింలలో మూడో వంతు జనం మీసాలు లేని గెడ్డాలతోనే బీజేపీకి మద్దతుదారులుగా, ఓటు బ్యాంకులుగా ధైర్యంగా ఉండేవారు. ఇస్లాం మతానికి పుట్టినిల్లయిన అరబ్ భూభాగాల్లో (ఈ అరబిక్ దేశాలు ఆసియా, ఆఫ్రికా ఖండాలకు వ్యాపించి ఉన్నాయి) ముస్లింలు ఇప్పుడు 44 కోట్ల మంది ఉన్నారు. హిందూ ధర్మం ఆధిపత్యమున్న భారత ఉపఖండంలోని మొత్తం 3 దేశాల్లో (పాక్, ఇండియా, బంగ్లాదేశ్) ముస్లింల జనాభా ప్రస్తుతం 60 కోట్లు. ఇలా అత్యధిక ముస్లింలు ఇస్లాం మతానికి జన్మనిచ్చిన అరబ్ భూభాగాల బయట ఉండడం మొత్తం ప్రపంచ ఇస్లాం సమాజానికి ఒక రకంగా హానికరమని కొందరు అరబ్ ఇస్లామిక్ పండితులు భావిస్తున్నారు. నాన్ అరబ్ దేశాల ముస్లింల జీవనశైలికి, అరబ్ దేశాల ముస్లింల బతికే తీరుకు పోలిక లేదు. 
(' ద ప్రింట్ ' వెబ్సైట్ ఎడిటర్ శేఖర్ గుప్తా శనివారం రాసిన ఇంగ్లిష్ వ్యాసం స్ఫూర్తితో)