మోడి గారూ!! విశాఖ ఉక్కు పై ఓ లుక్కేయండి !
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ వివాదం !! విశాఖ రాజధాని విలాపం !
*_మో'ఢీ' సారూ.._*
*_ఈ సంగతి చూద్దురూ..!_*
************************
*_విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.._*
*_విశాఖ రాజధాని వివాదం.._*
ఇంకా ఎన్నో సమస్యలు విశాఖ వాసులను పట్టి పీడిస్తున్న సమయంలో
మోడీ సారూ..
ఇటేపు వస్తున్నారా..
కాస్త ఈ సమస్యలపై
ఒక లుక్కేసి..
ఏదో ఒక సానుకూల పరిష్కారం చూపించి వెళ్లొచ్చు కదా..!
మా(ఆ)రోజుల్లో ఎవరైనా పెద్ద నాయకుడు..
రాష్ట్ర మంత్రి,కేంద్రమంత్రి..
ముఖ్యమంత్రి..ఇలా ఎవరు
తమ ప్రాంతానికి వచ్చినా
ఏవో కొన్ని వరాలు ఇస్తారని ఎదురు చూసేవారు..జనం..!
వచ్చే నేతలు కూడా ఆయా ప్రాంత ప్రజలను ఎప్పటి నుంచో ఊరిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి ఏదో ఒక సానుకూల ప్రకటన చేసి వెళ్ళేవారు..ఇదంతా ఇంచుమించుగా ఒక రివాజు అయిపోయింది.
ఇప్పుడు విశాఖ వస్తున్నది
సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..మరి అంత పెద్దాయన ఇక్కడికి వస్తున్నప్పుడు ప్రజలకు
ఎన్ని ఆశలు ఉంటాయి..
ఆయన ఏదో ఒకటి చెప్తారని..!
ముఖ్యంగా ఆయనే తలపెట్టిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన..నిజానికి ఇక్కడ ప్రతిపాదన అనే పదం వాడాల్సిన అవసరం లేదు.
అది ప్రతిపాదన దశ దాటి కార్యరూపం దాల్చే పరిస్థితి
ఆసన్నమైపోయింది.ఇదే మోడీకి జాన్ జిగ్రి దోస్తుకే ఆంధ్రుల హక్కును దారాదత్తం చేస్తున్నారు.
దీనిని ఆపేందుకు..
అడ్డుకునేందుకు
జరుగుతున్న ప్రయత్నాలు..
పోరాటాలు..ఆందోళనలు
పెద్దాయన సంకల్పం ముందు దిగదుడుపు అయిపోతున్నాయి.
మరి విశాఖ అంటే ప్రత్యేక అభిమానం ఉన్నట్టు చెప్పుకునే ప్రధాని తన నిర్ణయాన్ని మార్చుకుని
సానుకూల ప్రకటన చేయాలని కోరుకోవడం అత్యాశ అవ్వదు కదా!
అలాగే..మూడు రాజధానుల మ్యాటర్..ఇది ఎప్పుడు ఎలా పరిణమిస్తుందో తెలియని పరిస్థితి.కోర్టుల్లో తిరుగుతూ రకరకాలుగా మారుతున్న వాదనలు..ఈ అంశం చుట్టూ చెప్పలేనన్ని వివాదాలు..
వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సింది కేంద్రప్రభుత్వం..
ఆ ప్రభుత్వానికి నేతృత్వం వహించవలసినది ప్రధానమంత్రి..ఇప్పుడు ఆయనే సాక్షాత్తు విశాఖ వస్తున్నారు.
ఇప్పటివరకు కేంద్ర ప్రభు త్వానికి,,అక్కడ అధికార పార్టీకి సంబంధించిన పెద్దలు ఇటు వైపు వచ్చినప్పుడల్లా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ ప్రజల్లో అయోమయాన్ని మరింత పెంచుతున్నారు.ఈ పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టగలిగిన వ్యక్తి ప్రధాని..విశాఖకు రాజధాని వస్తుందా..రాదా..
ఆ అవకాశం ఉందా లేదా..
అదేదో ప్రధాని తేల్చి చెబితే బాగుంటుంది.. అంతే కాని *_తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి_* అనే రీతిలో కేంద్రం వ్యవహరించడం కరెక్ట్ కాదు..
అయితే ఇదంతా ప్రధాని చేస్తారనే ఆశ లేదు..
ఉక్కు కర్మాగారం విషయంలో బిజెపి ప్రభుత్వం మొదటి నుంచి మొండి వైఖరినే ప్రదర్శిస్తూ వస్తోంది.మీద నిర్ణయాలు జరిగిపోయాయి..
బేరాలు కూడా కుదిరిపోయినట్టున్నాయి.
అందుకే జనాభిప్రాయంతో పనిలేకుండా కేంద్రంలోని పెద్దలు తమ విధానాలతో ముందుకు పోతున్నారు.
నిజానికి విశాఖ ఉక్కు అనేది కేంద్రంలోని పెద్దమనుషులు..
ఇక్కడ రాష్ట్రంలోని పెద్ద తలకాయల దృష్టిలో యంత్రాలతో కూడిన ఒక వ్యవస్థ.కాని రాష్ట్రప్రజలు..ముఖ్యంగా ఈ ప్రాంత జనానికి అది ఎన్నో భావోద్వేగాలతో కూడిన
జీవనాడి.ఎన్నో పోరాటాలు..ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న జీవాధారం.అలాంటి ప్రధాన వ్యవస్థ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇక్కడి జనం అభిప్రాయంతో సంబంధం లేకుండా తన పాటికి తానే నిర్ణయం తీసుకుని ప్రైవేట్ పరం చేయాలనుకోవడం
ఎంతవరకు సబబు.!
ఇక రాజధాని విషయంలో కూడా కేంద్రంలోని అధికార పార్టీ రాజకీయ గిమ్మిక్కులకే
ప్రాధాన్యం ఇస్తోంది తప్ప
వివాదం మరింత పెరక్కుండా
ఆపే ప్రయత్నం చెయ్యలేదు.
చెయ్యదేమో కూడా..
రాజధాని విషయంలో
రాష్ట్రంలోని ప్రధాన పక్షాలైన వైసిపి..టిడిపి.. జనసేన తగవులు పడుతుంటే వినోదం చూస్తూ ఇదంతా రాజకీయంగా తమకు ఎంతవరకు మేలు చేస్తాయో బేరీజు వేసుకుని తదనుగుణంగా ఎన్నికల ముందు పొత్తులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేందుకే బిజెపి ప్రాధాన్యత ఇస్తుంది తప్ప ఇక్కడి పరిస్థితులతో ఆ పార్టీల్లోని పెద్దలకు ఏం పని?
ఇ.సురేష్ కుమార్