home page

ఎంపీ ఫైజల్ సభ్యత్వం రద్దు

హత్యా నేరం కేసులో శిక్ష పడిన నేపధ్యం 

 | 
ఎంపీ ఫైజల్ లోక్ సభ సభ్యత్వం రద్దు
కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు. ఒక హత్యాయత్నం కేసులో ఈ ఎంపీతో సహా మొత్తం నలుగురిని జనవరి 11న కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ హత్యాయత్నం కేసు 2009లో నమోదైంది. 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో కేంద్ర మాజీ మంత్రి పీఎం సయీద్ అల్లుడు పద్నాథ్ సలీహ్ ను ఫైజల్ హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటన కవరత్తిలోని జిల్లాలో జరిగింది. ఎంపీ మరి కొందరితో కలిసి ఈ హంతక దాడికి పాల్పడ్డారని ప్రాసిక్యూషన్ ఆరోపించారు. కేసు విచారించిన సెషన్స్ కోర్టు ఎంపీతోపాటు నిందితులందరికీ పదేళ్ల శిక్ష విధించింది. దానితో బాటు లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. దాంతో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఫైజల్ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్ సభ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు