home page

మెగా ఫాన్స్ కి మెగా ఫోర్స్!

 | 
మెగా star
మెగా ఫాన్స్ కి మెగాఫోర్స్ ని అందించిన డైరెక్టర్ బాబీ...వాల్తేరు వీర‌య్య రివ్యూ :రేటింగ్ ::(4/5)మెగా ఫాన్స్ కి మెగాఫోర్స్ ని అందించిన డైరెక్టర్ బాబీ.చిరంజీవి కి 20 ఇయర్స్ వెనకకు తీసుకోని వెళ్లిన డైరెక్టర్. చిరంజీవి కామిడీ సూపర్ హిట్ నవ్వులు, తమ్ముడు సెంటెమెంట్ చాలా బాగుంది..నటీనటులు: చిరంజీవి, రవితేజ, శ్రుతిహాసన్‌, కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ తదితరులు
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్‌
నిర్మాతలు: నవీన్‌ యెర్నేని,రవిశంకర్‌
దర్శకత్వం: కేఎస్‌ రవీంద్ర(బాబీ)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: ఆర్థన్‌ ఎ.విల్సన్‌ 
ఎడిటర్‌: నిరంజన్‌ దేవరమనే.           
 కధ :రా ఆఫీస‌ర్స్ పేరు మోసిన డ్ర‌గ్ డీల‌ర్ సాల్మ‌న్ సీజ‌ర్ (బాబీ సింహ‌)ను అరెస్ట్ చేసి ప్రైవేట్ జెట్‌లో తీసుకెళ్తుంటారు. టెక్నిక‌ల్ కార‌ణాల‌తో విమానాన్ని మారేడుమిల్లిలో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు. అక్క‌డ స్టేష‌న్‌లోని పోలీసుల‌ను చంపేసి సాల్మ‌న్ త‌ప్పించుకుంటాడు. దాంతో ఆ స్టేష‌న్ సీఐ సీతాప‌తి(రాజేంద్ర ప్ర‌సాద్‌)ని స‌స్పెండ్ చేస్తారు. దాంతో సీతాప‌తి ఎలాగైనా సాల్మ‌న్‌ను అరెస్ట్ చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకుంటాడు. అత‌ని గురించిన డీటెయిల్స్ సేక‌రిస్తాడు. సాల్మ‌న్ మ‌లేషియాలో ఉంటాడ‌ని తెలుసుకుంటాడు.
మ‌లేషియా నుంచి సాల్మ‌న్‌ను ఇండియాకు ఎలా తీసుకు రావాల‌ని ఆలోచిస్తున్న సీతాప‌తికి వాల్తేరు వీర‌య్య (చిరంజీవి) గురించి తెలుస్తుంది. వెళ్లి క‌లుస్తాడు. వీర‌య్య పాతిక ల‌క్ష‌లు కావాల‌ని డిమాండ్ చేస్తాడు. సీతాప‌తి డీల్‌కి ఒప్పుకుని.. వీర‌య్య‌ని, అత‌ని మ‌నుషుల‌ను తీసుకుని మ‌లేషియా వెళ్తాడు. సాల్మ‌న్ హోటల్‌లోనే రూమ్ తీసుకుంటారు. అక్క‌డే వీర‌య్య‌కి అతిథి (శ్రుతీ హాస‌న్) ప‌రిచ‌యం అవుతుంది. సాల్మ‌న్‌పై కొంద‌రు వ్య‌క్తులు దాడి చేస్తారు(హోటల్ లో పనిచేసే శృతి హాసన్, (RAW)వాళ్ళు.. ఆ స‌మ‌యంలో వారి నుంచి సాల్మ‌న్‌ని వీర‌య్య కాపాడుతాడు. దాంతో సాల్మ‌న్‌కి, వీర‌య్య‌కి మ‌ధ్య మంచి రిలేష‌న్ ఏర్ప‌డుతుంది. సాల్మ‌న్ త‌నకు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేయ‌ట‌మే కాకుండా త‌న‌తో పాటు ఓసారి ఇండియా వస్తే త‌న‌కు ప‌ర‌ప‌తి పెరుగుతుందని వీర‌య్య రిక్వెస్ట్ చేస్తాడు. అందుకు సాల్మ‌న్ ఒప్పుకుంటాడు.కానీ వాళ్ళు హోటల్ లో పనిచేసే వాళ్ళు తన మీద దాడి జరిగింది అని తెలుసుకొని వాళ్ళు రా వాళ్ళు అని, వాళ్ళు ని చంపాలని చూస్తాడు కానీ సాల్మన్ ని వీరయ్య చంపేస్తారు . Raw వాళ్ళు, రాజాంద్ర ప్రసాద్ వాళ్ళు, చిరంజీవి వాళ్ళు ఒకటి అయ్యో. మీ అందరికంటే పగ నాది అని ఫ్లాష్ బ్యాక్ స్టోరీ రవితేజ గురించి చెబుతారు. వీరయ్య వాళ్ళు నాన్న కాన్సటేబుల్ అయితే వాళ్ళు అమ్మ చనిపోయాక వాళ్ళు నాన్న మళ్ళీ పెళ్లి చేసుకొంటాడు రెండో భార్య కొడుకు రవితేజ. అయ్యేతే వాళ్ళకు ఒక్క నిమిషం కూడా పడదు.ప్రకాష్ రాజ్ అక్కడ కోకెన్ ని వీరయ్య ఐస్ ఫ్యాక్టరీ లో ఉంచి స్మోగలింగ్ చేస్తారు. అనుకోకుండా స్కూల్ పిల్లలకి కోకెన్ ఉన్న ఐస్ ని పంపిస్తారు అక్కడ 25మంది స్కూల్ పిల్లలు చనిపోతారు. అప్పుడు రవితేజ వీరయ్య ని అరెస్ట్ చేసి జైలు ఉంచి ఎన్కౌంటర్ చేయాలి అని పై ఆఫీసర్ చెబుతాడు, కానీ సరుకు ఎక్కడ ఉందొ తెలియదు,స్ట్రాంగ్ రూమ్ నుంచి రవితేజ మారుస్తాడు, కానీ వీరయ్య ని లోపల ఉంచి రక్షణ కలిపించాలి స్పాట్ కి రవితేజ వెళ్ళి ప్రకాష్ రాజ్ ని పట్టుకోవాలి అని చూస్తాడు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రవితేజ ని పొడిచి చంపేస్తారు.. రవితేజ వాళ్ళు అన్నని రక్షించాలని అని ఆఫీసర్ మీద కాల్పులు జరిపి చనిపోయారు అని బ్యాడ్ గా చెబుతారు. ప్రకాష్ రాజ్ మాలేషయా పారిపోతాడు, అక్కడ నుంచి ప్రకాష్ రాజ్ ని వీరయ్య తీసుకోని వచ్చి కోర్టు లో సాక్ష్యం చెప్పి రవితేజ నిర్దోషి అని నిరూపించి, కోర్టు లోనే ప్రకాష్ రాజ్ ని తల నరుకుతాడు వీరయ్య వాళ్ళు తమ్ముడు కి ఇచ్చిన మాటప్రకారం.. కధ ముగుస్తుంది.
పోరెళ్ల సాంబశివరావు  Mega
Porella. Sambasivarao MSc MBA cinima analyst Hyderbad 9290556685.