home page

గోదావరి జిల్లాల్లో మహాపాదయాత్ర ప్రభంజనం

అడుగడుగునా జై అమరావతి నినాదాలు  

 | 
karnataka farmers agitation

*ఉభయగోదావరి జిల్లాలు*

_*అదే సంకల్పం.. అదే నినాదం.. ఉత్సాహంగా అమరావతి రైతుల మహాపాదయాత్ర*_

*వెయ్యి రోజులు దాటినా సడలని సంకల్పం. గుండెల నిండా ఒకటే నినాదం. అదే అమరావతి అభివృద్ధి వాదం.*

*- గాంధీ చూపిన బాటలో అడుగులేస్తూ.. దేవస్థానాలను, న్యాయస్థానాలను నమ్ముకున్న రైతులకు.. వాడవాడలా జనం బ్రహ్మరథం పడుతున్నారు.*

*- ద్వారకా తిరుమలలో చిన వెంకన్న దీవెనలు తీసుకొని.. తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టిన రైతులకు ఘన స్వాగతం లభించింది.*

*- మంత్రుల మాటలకు అదరం బెదరం అంటూ అమరావతి రైతులు ముందుకు సాగుతున్నారు.*

★ రాజధాని రైతుల పాదయాత్ర 21వ రోజు ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల నుంచి మొదలై.. తూర్పుగోదావరి జిల్లా దూబచర్ల వరకూ సాగింది. 

★ యాత్ర ప్రారంభానికి ముందు గాంధీ జయంతిని పురస్కరించుకొని మహాత్ముడి చిత్రపటానికి ఐకాస నాయకులు నివాళులర్పించారు. 

★ అనంతరం ముందుకు కదిలిన రైతులను ద్వారకాతిరుమల గ్రామంలోకి అనుమతిలేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. 

★ ఉగాది మండపం వద్ద పోలీసులు, ఐకాస నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. 

★ కేసు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగినా.. రైతులు వెరవలేదు. 

★ భయపడేది లేదంటూ ముందుకెళ్లారు.

★ దారిపొడవునా రైతులకు అపూర్వ స్వాగతం లభించింది.

★ నల్లజర్ల మండలం అయ్యవరంలోకి ప్రవేశించిన రైతుల పాదయాత్రకు ఘన స్వాగతం లభించింది. 

★ గ్రామానికి వచ్చిన అమరావతి రైతులపై అయ్యవరం అన్నదాతలు పూలు చల్లి ఆహ్వానించారు. 

★ స్వామి రథం, రైతులకు బిందెలతో నీరుపోసి హారతులతో స్వాగతం పలికారు. 

★ ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని స్థానిక ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు డిమాండ్‌ చేశారు.

★ దేవీనవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మను దర్శించుకొని వచ్చిన కొంతమంది అమరావతి రైతులు, మహిళలు.. పసుపు, కుంకుమ, గాజులను తీసుకొచ్చి గోదావరి జిల్లాల ఆడపడుచులకు పంపిణీ చేశారు. 

★ గోదావరి జిల్లాల అభివృద్ధికి అమరావతి రైతులు వ్యతిరేకం కాదని వివరిస్తూ,.. ప్లకార్డులు ప్రదర్శించారు. మంత్రుల వ్యాఖ్యలపై మండిపడిన ఐకాస నేతలు.. ప్రభుత్వ తీరు మారేవరకూ పోరాటం ఆగదన్నారు. 

★ అయ్యవరంలో భోజన విరామం తీసుకున్న రైతులు.. దూబచర్ల వరకు యాత్ర కొనసాగించారు. 

★ 21వ రోజున దాదాపు 14 కిలోమీటర్ల మేర నడిచారు.