home page

అది జాతీయ రహదారి స్థలం

వివాదానికి తెర  పడినట్లేనా  ?

 | 
road layout. encroachment

* అది జాతీయ రహదారి స్థలం*

*🔹నివేదిక ఇచ్చిన కార్పొరేషన్ అధికారులు

*.. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపిన అర అంకణం బంకుకు సంబంధించి కార్పొరేషన్ అధికారులు నివేదికను కాసేపటి క్రితం అందజేశారు... గిరిజన మహిళ వనపర్తి దేవసేనమ్మ ఏర్పాటు చేసుకున్న బొంకు స్థలం నేషనల్ హైవే 67 కి చెందిందని స్కెచ్ తో సహా పోలీసు అధికారులకు నివేదిక రూపంలో సమర్పించారు... దేవసేనమ్మ ఏర్పాటు చేసిన బంకు స్థలం వేణుగోపాల స్వామి టెంపుల్ ల్యాండ్ కాదని ఆది నేషనల్ హైవే 67 గా నిర్ధారించారు. దీనికి సంబంధించి పూర్తి డ్రాయింగ్ కూడా అందజేశారు. కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్, సర్వే అధికారులు పూర్తిస్థాయిలో సంఘటన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఈ నివేదికను సమర్పించారు. వనపర్తి దేవసేనమ్మ అనే మహిళ రహదారి పక్కన ఈ ప్రాంతంలో చిన్న బొంకు ఏర్పాటు చేసుకున్నారని ఈ స్థలం 100 అడుగుల జాతీయ రహదారి పరిధిలోకి వస్తుందని నిర్ధారించారు. దీంతో ఈ వివాదం సరికొత్త మలుపు తిరిగింది. 15 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో చిన్న బంకు నడుపుతున్న దేవసేనమ్మ వేణుగోపాల స్వామి దేవస్థానం సిబ్బందిపై అనేక ఆరోపణలు చేసింది. తన వద్ద డబ్బులు డిమాండ్ చేశారన్న విమర్శలు గుప్పించింది. బంకు విషయంలో దూకుడుగా వ్యవహరించి కూల్చివేసిన వేణుగోపాల స్వామి దేవస్థానానికి సంబంధించిన సిబ్బంది నేడు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.mcv letter