home page

ఈ గెలుపు ఓ గెలుపేనా ?

మునుగోడు విజయంపై షర్మిల  

 | 
sharmila

మునుగోడు  ఉపఎన్నిక ఫలితాలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్  వేదికగా స్పందించారు.

మునుగోడు ఉపఎన్నిక  ఫలితంపై ట్విట్టర్‌లో షర్మిల సెటైర్లు వేశారు. డబ్బు, మద్యం పంచి టీఆర్‌ఎస్‌ గెలిచిందని షర్మిల ఆరోపించారు. కేవలం 10 వేల ఓట్లతో గెలవడం ఒక గెలుపేనా? అని షర్మిల అన్నారు.మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని హత్యచేసి గెలిచామంటూ సంబురాలు చేసుకోవడానికి సిగ్గుండాలని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతికత గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని షర్మిల తెలిపారు.