home page

'ఆనం' ను ఓడిoచడం ఎలా?

వైస్సార్సీపీ అధినేత అంతర్మధనo

 | 
anam floral tributes

ఆనం ఎక్కడ పోటీ చేసినా ఓడించాలని పట్టుదలతో ఉన్న జగన్ ! 

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఓడించాలన్న పట్టుదలతో వైస్సార్సీపీ అధ్యక్షుడు వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
గత 40 నెలలుగా తనను విమర్శించన ప్రతిపక్షం నాయకులలో చాలా మందిని కేసు లలో ఇరికించి వైస్సార్సీపీఅధికారం నాయకులు వేధింపులకు గురిచేసారు. అనేక మందిని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసిన ఆనందం పొందారని విపక్షాలు విమర్శించినప్పటికీ ప్రభుత్వ పెద్దలు వెరవలేదు. తనతో తగాదా పడిన ఎంపీ రఘురామకృష్ణం రాజును అరెస్ట్ చేసిన వైస్సార్సీపీ ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు వున్న పోలీసు సీ ఐ డి ఉన్నత అధికారులు రాజును హింసించి వీడియోస్ తీసి చూపించారన్నా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపధ్యoలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన అందరిపై కేసులు పెట్టనా ఎవరూ సాహసం చేసి ముఖ్యమంత్రి ని ప్రశ్నించే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో సొంత పార్టీ ఎమ్మెల్యే ఆనం ప్రభుత్వ విధానాలను నేరుగా విమర్శలు చేయడం తట్టుకోలేక పోయిన వైస్సార్సీపీ నాయకత్వం ఆనం స్థానంలో నేదురుమల్లి రామకుమార్ రెడ్డిని కో ఆర్డినేటర్ పేరుతో నియమించడం, అధికారులను మార్చడం వంటి చర్యలు తీసుకుంది. అంతే కాకుండా ఆనం భద్రతను కూడా తగ్గించి ఇద్దరు పోలీసులు సిబ్బందిని మాత్రమే ఉంచింది. 

2024 ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానని ఆనం  ఇంతవరకు ధృవీకరించనప్పటికీ, ఆయన పై పోటీ చేసేందుకు నాయకులు జంకుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల వైస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సొంతగా కొంత రాజీ యత్నాలు చేసినా ముఖ్యమంత్రి జగన్ చాలా కటువుగా మాట్లాడి కడప జిల్లాలో తనకు ప్రధానశత్రువు గా వున్న బద్వేల్ వీరా రెడ్డి కుటుంబం తో సంబంధం వున్న ఆనం తన కుమార్తె కైవల్య ను తెలుగుదేశం పార్టీలో చేర్చి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి తనకు స్నేహం వున్న మేకపాటి కుటుంబం పైనే పోటీ చేయించేందుకు ఆనం రామనారాయణ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టినా తాను సాహించానని, ఇప్పుడు నేరుగా ప్రభుత్వవిధానాలనే కన్వీనర్లు, వాలంటీర్లు వద్ద విమర్శించడం సహించరాని విషయమని, ఆనం రామనారాయణ  ఈ విషయమై తనకు కనీసం వివరణ కూడా ఇవ్వలేదని నెల్లూరు నాయకులను జగన్ ప్రశ్నించినట్టు ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఇవ్వరని కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆనం ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఓడించాలన్న పట్టుదలతో పార్టీ అధినాయకులు వున్నారని చెబుతున్నారు.  ఆనం కుటుంబం నెల్లూరు జిల్లాలో కనీసం అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రభావం చూపుతుంది.ఆనం చెంచు సుబ్బారెడ్డి, ఆనం సంజీవరెడ్డి, ఆనం వెంకటరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వరుసగా ఆత్మకూరు, రాపూర్, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, వెంకటగిరి నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన 80 ఏళ్ళ నుంచి రాజకీయాలలో వున్నారు. ఒకదశలో ఆనం చెంచు సుబ్బారెడ్డి కాంగ్రెస్ శాసనసభ నాయకుడుగా ఎన్నికై కూడా అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి రాజకీయం వల్ల సిఎల్పి నాయకత్వం వదులుకున్నారని చెబుతారు. ఆ విధంగా ఆనం కుటుంబం ముఖ్యమంత్రి పదవిని మొదటిసారి కోల్పోయిందని చెబుతారు. వై ఎస్ రాజశేఖరెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ అధినేత ముఖ్యమంత్రి పదవి కోసం సరిఅయిన అభ్యర్థి కోసం పేర్లు పరిశీలించినప్పుడు ఆనం రామ నారాయణ రెడ్డి పేరు కూడా పరిశీలన కు వచ్చింది. అయితే ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసే అలవాటు ఆనంకుటుంబానికి లేకపోవడం వల్ల ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి చేరుకోలేకపోయారు. కానీ కాంగ్రెస్ హై కమాండ్ ఆనంకు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఆర్ధిక శాఖను కేటాయించింది. అంతే సమర్ధతతో ఆనం ఆ శాఖను నిర్వహించారు. విభజన వల్ల 2014లో ఓటమి చెంది ఆ తర్వాత తెలుగుదేశం desam పార్టీలో చేరారు. కొన్ని కారణాల వల్ల 2018లో వైస్సార్సీపీ లో చేరారు. 2019 లో వెంకటగిరి నుంచి  ఎమ్మెల్యే గా ఎన్నికైనా మంత్రి పదవి పొందలేకపోయారు. అప్పటి నుంచి మౌనంగానే ఉంటూ వచ్చారు. ఆనం కుమార్తె కైవల్య రెడ్డి ఒంగోలు లో జరిగిన టీడీపి మహానాడులో  నారా లొకేష్ ను కలవడంతో రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. 

ఆనం నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గం లో కానీ మరెక్కడ  పోటీ చేసినా, ఆనం ను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా ఓడించాలని, ఆనం గెలవకుండా చూడాలని జగన్‌ మోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఈ ఏడాది లేదా గానీ,వచ్చే ఏడాది జనవరి,ఫిబ్రవరిలో గానీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనుండడంతో ఇద్దరు నేతలు ఏ మేరకు పట్టుదలతో ఉన్నారో, ఆనం పార్టీ మారుతారా? ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? అనే అంశంలో ఆనం వేసే అడుగులు బట్టి అంచనా వేయవచ్చు.