home page

భవిత నిర్దేశకుడు జగన్: వాసుపల్లి

 | 
Vasupalli

జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ మార్గ నిద్దేశకుడు

ఎం.ఎల్.ఎ వాసుపల్లి

విశాఖపట్నం, డిసెంబరు 13  : రాష్ట్రం లో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ మార్గ నిద్దేశకులుగా దక్షిణ నియోజకవర్గం ఎం.ఎల్.ఎ  వాసుపల్లి గణేష్ కుమార్ అభివర్ణించారు. మంగళవారం ప్రజా రవాణా శాఖ, వైఎస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్  రాష్ట్ర కమిటీ సర్యసభ్య సమావేశం స్థానిక దొండపర్తి జి.వి.ఎం.సి కళ్యాణమండపం లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వాసుపల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయిన మాట్లాడుతూ ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వికేంద్రీకరణ అంటే కేవలం కర్నూలు, అమరావతి, విశాఖపట్నం లో రాజధానిని నిర్మించాలని కాదని మొత్తం ఆంద్రప్రదేశ్ నే రాజధానిగా చేయాలని లక్ష్యం అని చెప్పారు. ఉద్యోగులు ప్రభుత్వ మనుగడకు ఉద్యోగులు కీలకమని, అందుకు ప్రభుత్వనికి ఉద్యోగులు సహకరించాలని కోరారు. తమ సంఘం ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షు, ప్రధాన కార్యదర్శి ఆర్ దేవరాజులు, జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేసిన దగ్గర నుండి జి.ఓలు విడుదల, వాటిని అమలు వరకు ఉద్యోగుల సంక్షేమం కొరకు కృషి చేసిందని చెప్పారు.  పీఆర్సీ 2022 లో మిగిలివున్న 2096 మంది ఉద్యోగుల సమస్య పరిష్కారాం అవుతుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.వి.వి.సత్యనారాయణ, అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్.కె.హాబీబ్, ఉప ప్రధాన కార్యదర్శిలు టి.రవిశంకర్, జి.పి.రావు, కార్యదర్శిలు అప్పారావు, పి.వి.రావు, ప్రచార కార్యదర్శి యు.వి.రత్నం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా అధ్యక్షు, కార్యదర్శిలు, డిపో అధ్యక్షు, కార్యదర్శిలు నాయకులు, ఉద్యోగులు తదితర అధిక సంఖ్యలో పాల్గొన్నారు.