home page

అమరావతిపై, మహా పాదయాత్ర పై ఫ్లెక్సీ వార్

ప్రతీకార ప్రచారానికి వైసిపి రెడీ  !

 | 
flexy war on amaravathi

ప్రస్తుత  తూర్పుగోదావరి జిల్లా (పాత పశ్చిమగోదావరి జిల్లాలోని ) నిడదవోలు నియోజకవర్గంలోకి ప్రవేశించిన  అమరావతి రైతుల మహాపాదయాత్రకు అక్కడ కూడా సర్కారీ నిరసన స్వాగతం పలికింది.

అమరావతి రియల్‌ ఎస్టేట్ వద్దు.. ఆంధ్ర స్టేట్ ముద్దు అంటూ వివిధ స్లొగన్స్ తో పోస్టర్లు ఏర్పాటు చేశారు నాయకులు.

జగన్(సీఎం జగన్‌ను ఉద్దేశించి..)ది స్టేట్ గురించి ఆలోచన అని, చంద్రబాబుది(ప్రతిపక్ష నేత చంద్రబాబు) రియల్ ఎస్టేట్ గురించి ఆలోచన అని అందులో పేర్కొన్నారు. జగన్ కోరుకొనేది అందరి అభివృద్ధి అయితే.. చంద్రబాబు కోరుకునేది అస్మదీయుల అభివృద్ధి అని, జగన్‌ది సమైక్యవాదం అని, చంద్రబాబుది భ్రమరావతి నినాదం అని, జగన్‌ది అభివృద్ధి మంత్రం అయితే.. చంద్రబాబుది రాజకీయ కుతంత్రం అని.. ఇలా అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా.. జై అమరావతి నినాదానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను  ప్రచురించారు.