home page

ఏపి లో ముందస్తు ఎన్నికలు: రఘు రామరాజు

 | 
Raghu

రాష్ట్రం లో ముందస్తు ఎన్నికలు ఖాయం

కర్ణాటక,  లేదంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే...

ఏపీ లో ముందస్తు ఎన్నికలు  జరిగే ఛాన్స్...

 ఎంపీ రఘురామకృష్ణంరాజు

 రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు  రఘురామకృష్ణం రాజు తెలిపారు . కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తో పాటు, లేదంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో కలిసి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మధ్య కూడా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగితే జరగవచ్చునని పేర్కొన్నారు. 20 24 లో పార్లమెంట్ ఎన్నికల తో పాటు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు  జరగవనేది ప్రస్తుత  పరిణామాలను పరిశీలిస్తే తేటతెల్లమవుతుందన్నారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఎంపీలను, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడ్డిపోచతో సమానంగా చూస్తారని విమర్శించారు.. అయితే వంద రోజులే ఎన్నికలకు సమయమని చెబుతూ ప్రస్తుతం ఎమ్మెల్యేలకు కాసింత గౌరవం ఇచ్చి సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు.  ఎన్నికల ఖర్చు నిమిత్తం  ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి కొంత  నగదును ఇవ్వాలని కోరినట్లు తెలిసిందన్నారు.. ఎన్నికలకు ఎంత ఖర్చైనా  మిగిలిన మొత్తాన్ని తానే భరిస్తానని వారికి హామీ ఇస్తున్నట్లు తనకున్న సమాచారముందని పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి అడిగిన మొత్తం చెల్లించడానికి సుముఖంగా లేనట్లు తెలిసిందన్నారు. తమ పార్టీ పెద్దలు మూటలు సిద్ధం చేసుకుని ముందస్తు ఎన్నికలకు సమాయాత్రమవుతున్నారన్నారు. అయితే కొద్దిమంది ఎమ్మెల్యేలు అవినీతి సొమ్ము సంపాదించి ఉంటే సంపాదించి ఉండవచ్చునన్న ఆయన,   వారు మళ్లీ నెగ్గే అవకాశాలు లేవన్నారు. మూటలు, మాటల రాజకీయాలకు ఈసారి ప్రజలు పడిపోరన్నారు. ఎమ్మెల్యే లు  ముందస్తుగా పార్టీ నాయకత్వానికి మూటలు అప్పజెప్ప వద్దని సూచించారు. 

  జగనన్న గృహ హింస పథకం

 జగనన్న గృహ హింస పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారని  రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇకపై  మరో ఇద్దరు గృహ సారధులను  నియమించనుంది. ఈ గృహ సారధులు, వాలంటీర్  సమన్వయంతో పనిచేస్తూ... ప్రజల బ్రెయిన్ వాష్ చేయనున్నారు. ప్రజలను ఏ సమయంలోనైనా  వెళ్లి డిస్టర్బ్  చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వీరికి కట్టబెడుతోంది. ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులు ఉంటే, వారి ఓట్లను మూడు నెలల ముందుగానే తొలగించే అవకాశం ఉంది. అధికార పార్టీకి ఓటు వేస్తామని  చెబితేనే తిరిగి ఓటరు జాబితాలో పేరు చేరుస్తామని వీరు షరతు విధించే  అవకాశాలు లేకపోలేదు. ప్రజలని ప్రలోభ పెట్టడం... లేదంటే భయపెట్టడమే  వాలంటీర్ల పని అయిపోయింది. వాలంటీర్లు, గృహ సారధుల నుంచి తమ ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా ఉండడానికి  వాలంటీర్లు గృహ సారధులకు తమను కలిసే సమయాన్ని ప్రజలే నిర్దేశించాలని రఘురామకృష్ణం రాజు  సూచించారు.

 రాచరికపు వ్యవస్థలోనూ  ఇంతటి అరాచక పాలన లేదు

 రాచరికపు వ్యవస్థలోనూ  ఇంతటి అరాచక పాలన కొనసాగలేదని రఘురామకృష్ణంరాజు అన్నారు. వాలంటీర్లు ప్రజలని ఇళ్లల్లో ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. గృహ సారధులు వారిని తమ మాటలతో చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఎన్నికల కోసమే ఇదంతా చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ  తమ పార్టీకి శాపంగా పరిణమిస్తుంది. స్వేచ్ఛ కోసమే గతంలో స్వాతంత్ర పోరాటం నిర్వహించి, స్వాతంత్రం సాధించుకున్నాం . బ్రిటిష్ వారి హయాంలో  ఉన్న పదో వంతు స్వేచ్ఛ కూడా నేడు రాష్ట్రంలో లేకుండా పోయింది. రాష్ట్రంలో ప్రజలంతా వాలంటీర్ల చిత్రహింసలు భరించలేక రాష్ట్రాన్ని విడిచి పారిపోయే పరిస్థితి నెలకొంది. రాజ్యాంగంలో కల్పించిన ప్రాథమిక హక్కుల కోసం పోరాటాలు, సత్యాగ్రహాలు చేయాల్సిన అవసరం లేదు. త్వరలోనే రానున్న  ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని రఘురామకృష్ణం రాజు సూచించారు.

 ప్రజాస్వామ్య పరిరక్షణకు యాప్ సిద్ధం చేస్తున్నా

 రాష్ట్రంలో ప్రజా  స్వామ్య పరిరక్షణ కోసం ఒక  యాప్ ను తనవంతుగా సిద్ధం చేస్తున్నట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ యాప్ లో  ఆధార్ నెంబర్ నమోదు చేస్తే, ఓటరు జాబితాలో పేరు ఉన్నది.. లేనిది సునాయాసంగా తెలుసుకోవచ్చు. ఈ మేరకు ఐటీ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నానని తెలిపారు.

 అప్రూవర్ గా మారిన అల్లుడు... మామ గుట్టురట్టు

 మామ పుణ్యమా అని  దేశంలోనే అగ్రశ్రేణి ఫార్మా కంపెనీలలో ఒకటైన అరబిందో ఫార్మా యజమాని తనయుడు ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు . వివేకానంద రెడ్డి హత్య కేసులో  షేక్ దస్తగిరి అప్రూవర్ గా మారి, హత్యలో ఎవరెవరు పాల్గొన్నది పూసగుచ్చినట్లు వివరించినట్లుగానే ప్రస్తుతం జైల్లో ఉన్న అల్లుడు మామ గుట్టు రట్టు చేసినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. జుగుస్సాకరమైన ట్వీట్లను చేస్తున్న విజయ సాయి రెడ్డిని  రాజ్యసభ ప్యానల్  చైర్మన్ పదవి నుంచి తప్పించిన విషయం తెల్సిందే. విజయసాయి రెడ్డి చేసిన  జుగుస్సాకరమైన ట్విట్ల వివరాలను తాను కూడా ఉపరాష్ట్రపతికి అందజేశాను. దీనితో రాజ్యసభ ప్యానల్ చైర్మన్ పదవికి విజయసాయి అనర్హుడని తొలగించారు. దానితో తాను పార్టీకి సేవలు చేసుకుంటానని పదవులు తనకు ముఖ్యం కాదని విజయ సాయి చెప్పిన విషయం తెలిసిందే. అయితే తన జైలు సహచరుడితో చెప్పించుకొని, తమ పార్టీ సభ్యుల సంఖ్యను చూపించి బ్రతిమాలుకొని  కాళ్ళ, వెళ్ళ పడి మరొక పదవిని సంపాదించుకున్నాడు. ఇది ఏ వన్, ఎటు విజయంగా భావించాలి. ప్రత్యర్ధులైన అభినందించాల్సిందే. అడుక్కుని పదవిని సాధించిన విజయసాయిరెడ్డిని అభినందిస్తూనే, నోటి వాచాలతను తగ్గించుకోవాలని సూచిస్తున్నా. కులం చూడం, మతం చూడమని చెప్పే ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి, కులానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కులం ఆధారంగానే  రాజ్యసభ కమిటీలలో  పదవులన్నింటినీ విజయసాయి రెడ్డి కే కట్టబెట్టేలా చొరవ తీసుకున్నారు. తమ పార్టీకి బీసీ లు బ్యాక్ బోన్ అని, నా ఎస్సీలు ఎస్టీలని ఆయా వర్గాల ప్రజలను మభ్య పెట్టవద్దని రఘురామకృష్ణంరాజు సూచించారు.

 వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చాలి

 వాల్మీకి బోయలను ఎస్టీ లో చేర్చాలని  తాను లోక్ సభలో కోరానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ప్రస్తుతం బీసీ  జాబితాలో ఉన్న వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి, ఆ మాట తమ పార్టీ పెద్దలు మర్చిపోయారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఈ మేరకు అసెంబ్లీ తీర్మానం కూడా చేశారు. కర్ణాటకలో బేడకురబాలను ఎస్టీ జాబితాలో చేర్చారు. వాల్మీకి బోయలను కూడా  ఎస్టీ జాబితాలో చేర్చే అంశాన్ని తనతో కేంద్ర మంత్రి చర్చించారు. మర్డర్ కేసులు మాఫీ చేయమని, సిబిఐ కేసులు ఎత్తివేయాలని, అప్పుల కోసం బతిమాలే తమ పార్టీ, ప్రభుత్వ పెద్దలు ఎస్సీ ఎస్టీ బీసీలు తమ బ్యాక్ బోనని చెబుతూనే,  ఆయా వర్గాలకు న్యాయం చేయాలన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని రఘురామకృష్ణం రాజు విమర్శించారు.

 రెండున్నర కోట్ల రూపాయలని వెనక్కి ఇవ్వాలి

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకల నిర్వహణ కోసం ప్రజాధనం నుంచి కేటాయించిన రెండన్నర కోట్ల రూపాయలను, ప్రభుత్వానికి వెనక్కి ఇవ్వాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎంతో సంపాదించారు. ఆ డబ్బుల లోంచి 10 కోట్లు వెచ్చించి, తన జన్మదిన వేడుకలను నిర్వహించుకోవచ్చు. అంతేకానీ రెండున్నర కోట్ల ప్రజాధనాన్ని జన్మదిన వేడుకల పేరిట దుర్వినియోగం చేయవద్దు. జగనన్న రక్త దీవెన పథకం లో ఆసక్తి ఉన్న ఔత్సాహికుల వద్ద నుంచి మాత్రమే  రక్తదానాన్ని సేకరించాలి. అంతేకానీ బలవంతంగా  రక్తదానాన్ని సేకరించవద్దు . ఎక్కువమందితో  రక్త దానం  చేయించిన వాలంటీర్లకు అవార్డులు ప్రధానం చేస్తారని ఉద్దేశంతో ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా రక్తదానం చేయాలని వేధించడం సరికాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. ఈ జన్మ దిన వేడుకలతోనైనా జగన్మోహన్ రెడ్డి  మారాలి. తన ప్రవర్తనను మార్చుకోవాలి. సంక్షేమ పథకాలకు తన పేర్లు పెట్టుకోవడం ద్వారా, ఫోటోలను ముద్రించడం ద్వారా ప్రజల గుండెల్లో నిలిచిపోతానని భావించడం అపోహనే. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పరిపాలన అందించాలి. తాను ఎనిమిది వందల మంది ఎంపీలకు రాసిన లేఖలపై పలువురు సానుకూలంగా స్పందించారు. తనని చిత్రహింసలకు గురి చేయడం, సత్తనపల్లిలో రైలు భోగి దగ్ధం చేసి హత్య చేయాలని చూడడం వంటి అరాచకాలను జగన్మోహన్ రెడ్డి ఇకనైనా మానుకోవాలని రఘురామకృష్ణంరాజు హితవు పలికారు.