home page

ముందస్తు ఎన్నికలే అవకాశం

రఘురామరాజు. అంచనా 

 | 
Raghu

ముందస్తు ఎన్నికల కే వెళ్ళండి

 ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ముందుకు వెళ్తాం

 ఏప్రిల్ లో ప్రభుత్వం రద్దు చేసే ఛాన్స్...

 జూలై, ఆగస్టు మాసాలలో ముందస్తు ఎన్నికలు

 స్మార్ట్ ముఖ్యమంత్రి జగన్..
 చెప్పింది ఒక్కటి కూడా చేసిన దాఖలాలు లేవు

వాలంటీర్లు, గృహసారధులను  ఇంటికి రానివ్వవద్దు 

 ప్రజల పట్ల జగన్ వైఖరి మారాలి

 నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ముందస్తు ఎన్నికల కే వెళ్లాలని  నర్సాపురం ఎంపీ,  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు సూచించారు. సంవత్సరం మూడు నెలల తర్వాత రావలసిన ఎన్నికలు, అతి త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు.  ప్రభుత్వ వ్యతిరేక  ఓట్లు చీలకుండా, ప్రజా పక్షం వహించి ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ప్రజల్లో ఇప్పటికే ఎంతో చైతన్యం వచ్చిందన్న ఆయన, ప్రధాన ప్రతిపక్ష నేత  చంద్రబాబు నాయుడు సభలకు హాజరవుతున్న ప్రజానీకమే దానికి నిదర్శనం పేర్కొన్నారు .  ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలకూడదని భావిస్తున్నా  జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులు ఎన్నికలు ఎప్పుడు జరిగినా  మంచి ఫలితాలను సాధిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
 ఆదివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఈ ఏడాది ఏప్రిల్ లో  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంది. వర్షాలు సమృద్ధిగా పడుతూ , విద్యుత్ కోతలు లేని సమయంలో అదను చూసుకొని జూలై, ఆగస్టు మాసంలో  రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికలు ఏ క్షణంలోనైనా రావచ్చు. ఏడు, ఎనిమిది నెలల ముందుగానే  ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలలో  ఎన్నో ప్రలోభాలు పెట్టే అవకాశం ఉంది. మనకు ఎన్నికల సమయంలో ఓటుకు ఎంత ఇచ్చిన, ఒక ఏడాది  చెత్త పన్ను, ఇంటి పన్ను రూపంలో మన వద్ద వసూలు చేసిన దాని కంటే చాల తక్కువే  ఇస్తారన్నారు. దుష్ట మనసుతో తమ పార్టీ నాయకులు ఇచ్చేది పుచ్చుకొని, భవిష్యత్తు బాగుండేలా విజ్ఞులైన ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రఘురామకృష్ణం రాజు కోరారు. 

 ముందస్తు ఎన్నికలకు సవాలక్ష కారణాలు

 రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి  ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి  జగన్మోహన్ రెడ్డికి  సవాలక్ష కారణాలు ఉన్నాయని  రఘురామకృష్ణం రాజు తెలిపారు.  చిన్న చిన్న పనులు చేయించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. పర్యావరణ అనుమతులు కూడా లభించని పోర్టుల నిర్మాణం పేరిట అప్పులు చేసి ఈ ఆర్థిక దుస్థితి నుంచి  గట్టెక్కాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. పోర్టుల నిర్మాణ ప్రగతిని పరిశీలించాకే, అప్పు మొత్తాన్ని దశలవారీగా విడుదల చేయాలని  ప్రధానమంత్రి కార్యాలయం తో పాటు, అవసరమైన వారందరికీ తెలియజేశాను. ప్రభుత్వం నిర్వహణ కు వక్రమార్గాలలో అప్పులు పుట్టకపోతే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం మినహా, జగన్మోహన్ రెడ్డికి మరొక ప్రత్యామ్నాయం లేదు. మూడు నెలల తర్వాత  ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేసే ఆర్థిక  పరిస్థితులు లేవు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా అద పాతాళానికి దిగజారిపోయిందని రఘురామకృష్ణం రాజు అన్నారు .

 జాబ్ క్యాలెండర్ ఇవ్వమంటే... సాక్షి క్యాలెండర్ ఇస్తున్నారు

 ప్రతి ఏడాది జనవరి ఒకటవ తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రకటించారని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇవ్వమంటే, సాక్షి దినపత్రిక క్యాలెండర్ ను ఇస్తున్నారు. గత మూడేళ్లు గడిచిపోయాయని, ఇది నాల్గవ ఏడాది. అయినా జాబ్ క్యాలెండర్ ఊసే లేదు.  డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పారు. కానీ నిర్వహించిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో 50వేల ఆరువందల అరవై ఆరు  ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్లో కేంద్ర మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 6000 స్కూళ్లను మూసి వేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు అని అనడమే తప్పితే, కొత్తగా ఒక్క టీచర్ ను నియమించలేదు. ప్రస్తుతం నాలుగు నుంచి 5వ తరగతి విద్యార్థుల  సీబీఎస్ఈ సిలబస్ జన్యునుగా పరీక్షలు రాసి ఫస్టు క్లాసులో  పాసైన తమకే    కన్ఫ్యూజన్ గా ఉంది. ఇక పరీక్షలు రాయకుండానే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యామని  చెప్పేవారి  పరిస్థితి ఏమిటో మనకు అర్థం కాదు. గతంలో  ఎం ఈ డి, బీఈడీ లు  చదివి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి, ప్రస్తుత సీబీఎస్ఈ సిలబస్ ఆకలింపు చేసుకోవడానికి ఇబ్బందులు తప్పవు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే నానా హింసలు పెట్టింది. తాజాగా జగనన్న స్మార్ట్ ఆలోచనలో భాగంగా  పది నిమిషాలు ఆలస్యంగా స్కూలుకు వచ్చే టీచర్  ఫోటో తీసి అప్లోడ్ చేయాలట. ఇక ఎలాగూ  పది నిమిషాలు ఆలస్యం అయ్యింది కదా అని...   జీతం కట్ చేస్తారని ఉద్దేశంతో ఆ ఉపాధ్యాయుడు
స్కూలుకే  రావడం మానివేస్తాడు. అప్పుడు విద్యార్థులు నష్టపోవలసి వస్తుంది. దానికంటే  ఉదయం ఆలస్యంగా వచ్చిన ఉపాధ్యాయున్ని సాయంత్రం అదనపు సమయం పని చేయమంటే బాగుంటుంది. ఉపాధ్యాయులకు పెట్టిన నిబంధనలే  ఐఏఎస్ అధికారులకు కూడా విధించాలి. ముఖ్యమంత్రి కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగే . ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకొని ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగం. అందుకే ఆయన కూడా జిల్లాల పర్యటనలు లేనప్పుడు తన కార్యాలయానికి సకాలంలో హాజరు కావాలి.   మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు  సచివాలయానికి హాజరవుతున్న దాఖలాలే లేవని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

 ఇచ్చిన హామీల అమలు పై సింహవలోకనం చేసుకుందాం

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ఒక్కసారి సింహవలోకనం చేసుకోవాలని రఘురామకృష్ణం రాజు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలలో 98.7  శాతం అమలు చేశానని జగన్ చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల వ్యవధిలోని సిపిఎస్ రద్దు చేస్తామని  ఎన్నికల ముందు జగన్ చెప్పారు.ప్రభుత్వ  ఉద్యోగులు కోరుకుంటున్నట్లుగా
ఇప్పటివరకు సిపిఎస్ ను   రద్దు చేయలేదు. మద్య నిషేధం అమలు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. మధ్య నిషేధానికి  తూట్లు  పొడిచి, నియంత్రణ అంటున్నారు. డిసెంబర్ 31వ తేదీన ఉదార స్వభావంతో  మద్యం అమ్మకాల సమయాన్ని మరో రెండు గంటల పాటు పొడిగించారు. మద్యాన్ని ఆదాయ వనరుగా  రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కూడా మధ్య నిషేధం జోలికి వెళ్లకుండా ఉండే స్థాయిలో  అప్పులు చేసింది. ఆరోగ్యశ్రీ  పథకంలో భాగంగా ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడం లేదు. గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలకే పేర్లు మార్చి, ప్రస్తుతం అమలు చేస్తున్నారు. 2000 నుంచి 3000 రూపాయలకు పెన్షన్ పథకం పెంచుతామని చెప్పి, మాట తప్పారు. 1000 నుంచి 1250 కి పెంచారా?, 2000 నుంచి 2250కు కి పెంచారా??, అన్నదానిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి. ఈరోజు పత్రికల్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్  పచ్చి మోసం. 2014 నుంచి 2019 వరకు అని ఆ అడ్వర్టైజ్మెంట్ లో పింఛన్ల అంకెలు వేశారు. 2019 జనవరిలోనే పింఛన్ల మొత్తాన్ని రెండు వేల రూపాయల చేశారు. గత ప్రభుత్వ హయాంలో 43 లక్షల మంది మాత్రమే పింఛన్లు తీసుకున్నట్లుగా దొంగ లెక్కలు  చెప్పారు. 2019 జనవరిలోనే  పింఛన్లు తీసుకున్న వారి సంఖ్య 53 లక్షలు. ఇక గత ప్రభుత్వ హయాంలో  ఐదేళ్లలో యావరేజ్ సంఖ్యను చూపించి  మసి పూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  దాన కర్ణుడు ఏమి కాదు. కుంభకర్ణుడని రఘురామకృష్ణం రాజు విమర్శించారు.

 కొత్తగా ప్రజలకు ఇచ్చిందేమిటి?

 రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రజలకు ఇచ్చింది ఏమిటి అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. అమ్మ ఒడి పథకాన్ని కొత్తగా అమలు చేశారు. అయితే ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే,  ఇద్దరికీ అమ్మబడిని వర్తింప చేస్తామని చెప్పారు. కానీ ఒక్కరికే  వర్తింపచేసి, అందులోనూ రెండు వేల రూపాయల కోత విధించారు. అమ్మ ఒడి పథకం అమలు వల్ల  ఎస్సీ ఎస్టీలకు  సబ్ ప్లాన్ లేకుండా పోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు డి ఏ లను వెంటనే ఇస్తామని  చెప్పినజగన్,
 గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన డిఏల మొత్తాన్ని కూడా తగ్గించారు. ఇంటి పన్నును అడ్డగోలుగా పెంచారు. చెత్త పన్ను వేస్తామని చెప్పారా?, కానీ ప్రజలపై చెత్త పన్ను వేశారు. విద్యుత్ చార్జీలు  గతంలో కొద్దిగా పెరిగితేనే గగ్గోలు పెట్టిన తమ పార్టీ పెద్దలు, ఇప్పుడు ఇష్టారీతిలో   పెంచారు. విద్యుత్ చార్జీలు ఎన్నిసార్లు పెంచాం... ఎందుకు పెంచామన్న దానికి లెక్కే లేదు. ప్రజలకి ఇచ్చిన ప్రతి మాట తప్పాం.... చెప్పిన ప్రతిసారి మడమ తిప్పాం. అయినా రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను  98.7% అమలు చేశామని  చెప్పుకుంటున్నామని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

 పార్టీ గృహసారథులు వాలంటీర్లతో కలసి వెళ్ళటం చట్టవిరుద్ధం

 రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న  గృహ సారథుల వ్యవస్థ   చట్ట విరుద్ధమని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. ప్రజలపై ఆధిపత్యం చలాయించడానికి కొత్తగా గృహ సారథులు వస్తున్నారు. గృహసారథులను వాలంటీర్లు ప్రజలకు పరిచయం చేస్తారట. ప్రభుత్వ పథకాలను  ఇకపై గృహ సారథులు  ప్రజలకు చేరవేస్తారని చెబుతున్నారు. వృద్ధులకు,  వితంతువులకు పింఛన్లను జగన్ బాబు ఇస్తున్నారని, జగన్ బాబు లేకపోతే పింఛన్లు అందవని ఇకపై గృహ సారథులు ప్రచారం చేయనున్నారు. గత ప్రభుత్వమే అధికారంలో ఉండి ఉంటే మూడు వేల రూపాయల పింఛన్లు  అందేవి. ప్రజలు అత్యాశకు పోయి మోసపోయారు. మనం పన్నుల రూపంలో చెల్లించే డబ్బులను మనల్ని పెంచి పెద్ద చేసిన వృద్ధులకు ఒక సంక్షేమ పథకం రూపంలో అందజేయడానికి వాలంటీర్లు ఎవరు?. ప్రభుత్వమే నేరుగా అందజేసే అవకాశం ఉన్నప్పటికీ, వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పథకాల గురించి జగన్ బాబు ఇస్తున్నట్టుగా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా  వాలంటీర్లు కీలక భూమిక పోషించాలని మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే రాపాక ప్రసాదరావు  పేర్కొనడం పరిశీలిస్తే, వాలంటీర్ వ్యవస్థ ఎవరికి ఉపయోగపడుతుందో అర్థం అవుతుంది. గృహ సారథులను ఇంటికి రాకుండా ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలి. వాలంటీర్లను కూడా పింఛన్లు అందజేసే కూలీలు గానే చూడాలి. జగనన్న కటింగ్ పథకం లో భాగంగా వృద్ధులు వితంతువులకు అందజేసే   పింఛన్  డబ్బులలో నుంచి  50,  వందల రూపాయలను వాలంటీర్లు కోత విధిస్తున్నారు. ప్రజలతో ఇప్పటికే మనకు సంబంధాలు చెరిగిపోయాయి. మన పార్టీ కార్యకర్తలను ప్రభుత్వ ప్రతినిధుల ముసుగులో ప్రజల ఇళ్లలోకి పంపవద్దు. ఏజెన్సీ ప్రాంతంలోని తమ పార్టీకి అతి చేరువగా  ఉండే ఒక వర్గం ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. దీన్నిబట్టే మా పార్టీ భవిష్యత్తు అంధకారమని స్పష్టం అవుతుందని రఘురామకృష్ణం రాజు అన్నారు.

 విశాఖ రాజధానిగా రాష్ట్రాన్ని ప్రకటించాలట...

 విశాఖను రాజధానిగా ప్రకటించకపోతే, విశాఖ రాజధానిగా నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. రాష్ట్రం కూడా ఇచ్చే అధికారం జగన్మోహన్ రెడ్డికి ఉందా?, లేకపోతే ఇది జగన్మోహన్ రెడ్డి పై ధర్మాన చేస్తున్న తిరుగుబాటా?. తమ పార్టీలో ఇప్పటికే తిరుగుబాటు మొదలయ్యింది. 20 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు పక్క పార్టీతో టచ్ లో ఉన్నారని పత్రికల్లో కథనం వచ్చింది. వారి పేర్లను ఆ కథనంలో రాయలేదు. ఒకవేళ రాస్తే నాకిచ్చినట్లుగానే, వారికి నోటీసులు ఇస్తారని భావించి ఉండవచ్చు. ఏపీ సి ఎస్ అనే యాప్  పునరుద్ధరణకు అవసరమైన ఫీజును చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం వద్ద డబ్బులు లేక చెల్లించలేదు. పింఛన్లు అందజేసే వారి  వద్ద నుంచి ఈ యాప్ ద్వారా  వేలిముద్రలు సేకరిస్తారు. ఈ యాప్ పని చేయకపోవడంతో వృద్ధులకు, వితంతువులకు పింఛన్ల చెల్లింపులో ఆలస్యం జరిగినట్లు తెలిసింది. పించన్ దారులకు అవసరమైన డబ్బులు చెల్లించడానికి స్థానిక అధికారుల పూచికత్తు మీద పెట్రోల్ బంకులలో పది నుంచి 50 లక్షల వరకు మాట్లాడి సర్దుబాటు చేసినట్లు సమాచారం. రేపు బ్యాంకులలో డబ్బులు డ్రా చేయనున్నప్పటికీ, ఈరోజే ఇచ్చినట్లుగా  పింఛనుదారుల వద్ద వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఇక  పింఛన్  లబ్ధిదారులకు  వాలంటీర్లు దొంగ నోట్లు కూడా పంచినట్లు తెలిసింది. దొంగ నోట్ల సర్కులేషన్ కు ఈ విధానము మంచి అడ్వాంటేజ్. లబ్ధిదారులకు ఇచ్చే సొమ్ములో  ఒక దొంగ నోటు కలిపి ఇస్తే, లబ్ధిదారులు చేయగలిగిందేమీ లేదు. ఒక యువ వితంతువుకు పింఛన్ ఇవ్వడానికి నాతో పాటు రావాలని  వాలంటీర్ ఒత్తిడి చేసినట్లుగా వార్తలు వచ్చాయి. వాలంటీర్ల ఈ రకమైన వేధింపులు కో కొల్లలుగా  వెలుగుచూశాయని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

 బీఆర్ఎస్ రాష్ట్ర శాఖ ను జగన్ ప్రారంభిస్తారేమో...

 ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సభ నిర్వహిస్తే గుండెలు బాదుకున్నా తమ పార్టీ నాయకులు, బి ఆర్ ఎస్ పార్టీని మాత్రం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని  రఘురామకృష్ణం రాజు అన్నారు. బిఆర్ఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా  కాపు సామాజిక వర్గానికి చెందిన, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ నియమించనున్నట్లు తెల్సింది. ఆయన రేపు బీ ఆర్ ఎస్ లో చేరనున్నట్టు సమాచారం. తమిళనాడు కు రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి గా పనిచేసిన   కాపు సామాజిక వర్గానికి చెందిన మరొక వ్యక్తి కూడా  బీ ఆర్ ఎస్ లో చేరానున్నారు.  టిఆర్ఎస్ రాష్ట్ర శాఖను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తమ పార్టీ శాసనసభ్యులతో కలిసి వెళ్లి ప్రారంభిస్తారేమోనని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

 కాపు సేన గా జనసేనకు అపప్రద

 జనసేనకు  కాపు సేనగా  అపప్రద వచ్చిందని, రేపటి నుంచి  ఆ అపప్రద తొలిగిపోనుందని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. జనసేన ఏ ఒక్క కులానికి, వర్గానికి చెందిన సేన కాదు. అన్ని వర్గాలకు సంబంధించినదే జనసేన. ప్రజలలో కాపులు ఎక్కువగా ఉన్నారని, అందుకే కాపుల సమస్యలపై పవన్ కళ్యాణ్ ముందుండి పోరాడుతున్నారు. జనసేనలో కాపులకే అధిక ప్రాధాన్యత ఇస్తే, ఆ సామాజిక వర్గానికి చెందిన బ్యూరోక్రాట్లు  ఎందుకు ఇతర పార్టీల లోకి వెళ్తారు. అన్ని కులాల సమ్మేళనమే జనసేన. నూతన సంవత్సరం నుండి పవన్ కళ్యాణ్ కు కొత్త  శుభాలు ప్రారంభం కానున్నాయి.

 ఎన్నికల సమయంలో డీజీపీగా సునీల్ కుమారే

 ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డీజీపీ  గా సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు పదోన్నతి కల్పించారని రఘురామకృష్ణం రాజు  తెలిపారు. ప్రస్తుత డిజిపి  కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి  వృత్తిపరంగా  సమర్థవంతమైన అధికారి. సీనియర్లను కాదని  ఆయన్ని డీజీపీ గా నియమించారు. కానీ ఆయన ఏనాడు  తన విధి నిర్వహణలో  తప్పులు చేయలేదు. విధినిర్వాహణలో  తమ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునే  అధికారిని లా అండ్ ఆర్డర్  డీజీపీ గా నియమించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే విధంగా వ్యవహరించే పీవీ సునీల్ కుమార్ వంటి  వ్యక్తి , ముందస్తు ఎన్నికల సమయంలో డీజీపీ గా ఉంటే , రాజకీయంగా తమకు లబ్ది చేకూరుతుందని  జగన్ అంచనా వేస్తున్నారు. అందుకే పొరుగు రాష్ట్రాలలో ఎక్కడా కూడా 1993 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారులకు డీజీపీ క్యాడర్ గా  పదోన్నతి కల్పించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం  1993 బ్యాచ్ కు చెందిన పీవీ సునీల్ కుమార్ కు మాత్రం  డీజీపీగా పదోన్నతి కల్పించారు. తనని కాళ్లు కొట్టిసి నప్పుడు పీవీ సునీల్ కుమార్ వీడియో చిత్రీ కరిస్తే, జగన్ చూసి ఆనందించారని రఘు రామ కృష్ణం రాజు అన్నారు.