home page

తమిళనాడు రెవిన్యూ మంత్రితో ధర్మాన కమిటీ చర్చలు

 | 
Dharmana

ఆంధ్రప్రదేశ్ లో అసైన్డ్ భూములను లబ్ధిదారులు అమ్ముకునే హక్కు ఏ విధంగా ఇవ్వాలనే అంశంపై తమిళనాడు రెవెన్యూ అధికారులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కమిటీ చర్చించింది.

ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన ఉన్న రాష్ట్ర స్థాయి కమిటీ తమిళనాడు కర్ణాటకలో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, తమిళనాడు రెవెన్యూ మంత్రి రామచంద్రన్ తో కూడిన అధికార బృందంతో చర్చలు జరిపారు. 

ఈ కమిటీ లో రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్, మెరుగు నాగార్జున, ఉన్నతాధికారులు ఇంతియాజ్, గణేష్ లు తమిళనాడు అధికారులతో చర్చించారు.

తమిళనాడు ప్రభుత్వం గతంలో ఇచ్చిన భూములకు అమ్ముకునే హక్కు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అమలులో ఎదురయ్యే సవాళ్లను తెలుసుకునేందుకు కమిటీ ఈ పర్యటన చేపట్టింది. మంగళవారం నాడు కర్ణాటక రెవెన్యూ అధికారులతో చర్చలు   కొనసాగనున్నాయి.