home page

హోమ్ మంత్రి పదవికి డిమాండ్

రేసు లో అయ్యన్న పాత్రుడు, అచ్చేనాయుడు 

 | 
ayyanna
అప్పుడే టీడీపీలో హోంమంత్రి పదవికి ఫుల్ డిమాండ్!
ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటూ తెలుగుదేశం వేగంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని పలువురు తెలుగుదేశం సీనియర్ నేతలు విపరీతమైన విశ్వాసంతో ఉన్నారు. ఈ లెక్కలు నేతలను యాక్టివేట్ చేసి తమ భవిష్యత్తు రాజకీయ గమనాన్ని ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కేబినెట్‌ బెర్త్‌ దక్కే అవకాశాలున్నాయని కొందరు అంచనా వేస్తున్నారు.
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.మరో 9 నెలల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని,తానే రాష్ట్ర హోంమంత్రిని అవుతానని,శాంతిభద్రతలను ఎలా నిర్వహించాలో చూపుతానన్నారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని,పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అయ్యన్న ఆరోపించారు.టీడీపీ ప్రభుత్వంలో హోంమంత్రిగా ఏపీలో శాంతిభద్రతలను పరిరక్షిస్తానన్నారు.
అంతకుముందు టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఏపీకి తదుపరి హోంమంత్రిని తానేనని,పక్షపాతంగా వ్యవహరించిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటానని అన్నారు.సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అరెస్ట్ సందర్భంగా అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.తనపై తప్పుడు ఫిర్యాదులు,కేసులు పెట్టిన పోలీసులను వదిలిపెట్టబోనని ఏపీ టీడీపీ అధినేత అన్నారు.తన అనుచరులతో జరిగిన సమావేశంలోనూ అచ్చెన్నాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
రాయలసీమకు చెందిన నేతలు కూడా హోంమంత్రి పదవిని ఆశిస్తున్నారని టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.హోంమంత్రి పదవికి ఫుల్ డిమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. అధికారంలోకి రాకముందే టీడీపీ నుంచి హోంమంత్రి పదవిని ఆశించే వారి జాబితా పెద్దదవుతోంది.అనే విషయాలను ఊహించకుండా నేతలు ఎన్నికలపై దృష్టి సారించి పార్టీ గెలుపునకు కృషి చేయడం మంచిదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.