ఇళ్ల పట్టాల పంపిణి చేసిన ధర్మాన
*01-01-2023,*
*శ్రీకాకుళం.*
*లబ్ధిదారుల కు ఇళ్ల పట్టాలు పంపిణీ*
మున్సబ్ పేటకు చెందిన 36 మంది లబ్ధిదారులకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు ఆదివారం సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో ఇళ్ల పట్టాలు అందించారు. వైఎస్సార్ జగనన్న కాలనీలకు సంబంధించి ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసి, లబ్ధిదా రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ., త్వరితగతిన ఇళ్ళ నిర్మాణం పూర్తి చెయ్యాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తూ.. అధికార యంత్రాంగాన్ని సమన్వయపరుచుకుంటూ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అనంతరం లబ్ధిదారులంతా రెవెన్యూ శాఖామాత్యులకు కృతజ్ఞతలు తెలిపా రు. కొత్త ఏడాది వేళ ఈ విధంగా ప్రభుత్వం తరఫున ఇళ్ల పట్టాలు అందుకోవడం తమకెంతో ఆనందంగా ఉందని అన్నారు.
ఎమ్మార్వో వెంకటరావు, ఎంపిపి అంబటి నిర్మల శ్రీనివాస్, అంబటి శ్రీనివాసరావు, రంది రాజారావు తదితరులు పాల్గొన్నారు.