అర్ధరాత్రి అయ్యన్న అరెస్టు !
ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిన సీఐడీ
గతంలో పలుమార్లు అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించి విఫలమైన సీఐడీ పోలీసులు .. ఈ సారి ఆయన ఇంట్లో ఉన్న సమాచారం తెలుసుకుని అర్థరాత్రి దాడి చేశారు. పెద్ద ఎత్తున పోలీసులతో వచ్చి .. ఫోన్ సిగ్నల్స్ నిలిపివేసి.. ఆయనను హుటాహుటిన తరలించేశారు. విషయం తెలుసుకుని కొద్ది మంది అనుచరులు వచ్చేలోపు ఆయనను రాజమండ్రి తరలిస్తున్నట్లుగా కుటుంబసభ్యులకు నోటీసులు ఇచ్చి తీసుకెళ్లిపోయారు. అయ్యన్నతో పాటు ఆయన చిన్న కుమారుడు చింతకాయల రాజేష్‌ను కూడా అరెస్ట్ చేశారు.
అయ్యన్నపై నమోదైన కేసులన్నింటిలో ఇప్పటి వరకూ రక్షణ పొందారు. దీంతో సీఐడీ పోలీసులు కొత్త కేసు నమోదు చేశారు. అలా కేసు నమోదైన విషయం ఎవరికీ తెలియదు. ఏదో కేసులో కోర్టుకు సమర్పించిన పత్రాలు నకిలీవని.. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. అలా కేసు నమోదవడం కానీ. అరెస్ట్ జారీ చేయడం గురించి కానీ ఎవరికీ తెలియదు. కానీ రాత్రికి రాత్రి ్రెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. ీ వ్యవహారం సంచనలనం రేపుతోంది. అయ్యన్నపాత్రుడిని నెట్టుకుంటూ తీసుకుపోతున్న దృశ్యాలు వైరల్ అయ్య్యాయి.
ప్రభుత్వంపై . తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న అతి కొద్ది మంది నేతల్లో అయ్యన్నపాత్రుడు ఒకరు. ఆయనను అరెస్ట్ చేసి కస్టడీలో కొట్టాలని చూస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో రఘురామకృష్ణకృష్ణరాజు తరహాలోనే అరెస్ట్ చేసి కొట్టాలనుకుంటున్నారని.. దాన్ని లైవ్‌లో ఓ ముఖ్యనేతకుచూపించాలనుకుంటున్నారని.. గతంలో అయ్యన్న పాత్రుడు కూడా ఆరోపించారు. ఇప్పుడు అర్థరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఆయనను అలా కొడతారో లేదో కానీ.. రాజకీయ కక్ష సాధింపులు మాత్రం. ఎవరూ ఊహించని స్థాయికి వెళ్లాయి. వీటి పరిమామాలు ఏపీ రాజకీయాల్ని మరింతగా దిగజార్చడం ఖాయంగా కనిపిస్తోంది.