home page

వీరంతా బియ్యం దొంగలు కాదా ?

బియ్యం ఎగుమతులపై    కొమ్మారెడ్డి ధ్వజం  

 | 
Pattabhi

*టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం స్క్రోలింగ్స్*

పేదోడి బియ్యాన్ని సైతం పందికొక్కుల్లా బొక్కేస్తున్న జగన్ బియ్యం బకాసురులు
‘ఖతర్నాక్ కారుమూరి’, ‘దోపిడీకి ద్వారం.. ద్వారంపూడి’తో బియ్యం దందా
పంట దిగుబడులు పెరగకుండా.. బియ్యం ఎగుమతులు పెరగడం వెనుక మతలబు ఏమిటి?
2018-19లో దిగుబడులు 82.30 లక్షల టన్నులుంటే 2020-21 నాటికి 78.90 లక్షల టన్నులే
కానీ.. ఎగుమతులు 2018-19లో 18,09,274 టన్నులుంటే.. 2020-21కి 31.51 లక్షల టన్నులకు ఎలా పెరిగాయి.?
2021-22 నాటికి ఏకంగా  48.26 లక్షల టన్నులకు చేరాయి. 
పంట దిగుబడులు పెరగకున్నా బియ్యం ఎగుమతులు ఎలా పెరుగుతున్నాయి?
తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో దిగుబడులు పెరిగాయన్నదీ పచ్చి అబద్దమే
ఏపీ, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల మొత్తం దిగుబడులు 2018-19లో 2.14 కోట్ల టన్నులు 
2020-21కి 2.27 కోట్ల టన్నులు అంటే కేవలం 5.80 శాతం పెరిగాయి. 
కానీ కాకినాడ కేంద్రంగా ఎగుమతులు మాత్రం 42.5 శాతం పెరిగాయి. 
ఇదెలా సాధ్యమో బియ్యం బకాసురులు, వారిని నడిపిస్తున్న జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. 
2018-19కి, 2021-22కి మధ్య దిగుబడులు 12.96 శాతం పెరిగితే.. ఎగుమతులు మాత్రం 62శాతం పెరిగాయి. 
2019-20 నుండి 2022 మే వరకు కేంద్రం ఏపీకి 62,05,788 టన్నుల బియ్యం ఇచ్చింది.
కానీ అందులో 5.66 వేల టన్నుల బయ్యం లెక్కలు తేల లేదని పియూష్ గోయల్ సమాధానమిచ్చారు
బియ్యం మాఫియాలో వచ్చిన వాటాల తేడాలతో తెనాలిలో హత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి
కేంద్రం ఇచ్చే బియ్యాన్ని పేదలకు పంచకుండా అడ్డదారుల్లో కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు అమ్ముకుంటున్నారు.
2020-21 ఛత్తీస్ గఢ్ నుండి కాకినాడ పోర్టుకు రైల్వే వ్యాగన్లలో వచ్చింది 9.91 లక్షల టన్నులు మాత్రమే
అక్రమ బిల్లులతో రూ.146 కోట్లు స్వాహా చేశారని సివిల్ సప్లైస్ కమిషనర్ లేఖ రాశారు
2021లో రాష్ట్ర ప్రభుత్వం 82.75 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు పేర్కొన్నారు
కానీ 2020-21లో దిగుమతులు 75.90 లక్షల టన్నులుగా కేంద్ర ప్రభుత్వ నివేదికల్లో ఉన్నాయి
ఉత్తత్తి కంటే.. ఎక్కువ సేకరణ ఎలా సాధ్యమో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.
దొంగ బిల్లులతో సొమ్ము దోచేస్తున్నారని ఇంత కంటే సాక్ష్యాలు ఏం కావాలి?
దేశంలోనే అతిపెద్ద బియ్యం కుంభకోణం ఏపీలో జరుగుతోంది
ఈ బియ్యం కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలి