Andhra pradesh mines office GS excise department

ఆంధ్రప్రదేశ్ కు అబ్కారీ ఆదాయమే దిక్కు

ఆర్థిక సంక్షోభం జఠిలమవుతోంది. ఆరు నెలల నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి. ఇంజనీరింగ్ శాఖ పరిధిలో పనులు చేసిన వారికి బిల్లులు కాక నానా ఇబ్బందులు పడుతున్నారు. కోట్లలోనే బిల్లుల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే రెండు త్రైమాసికాలు పూర్తయినా బడ్జెట్ కేటాయింపులకు తగినట్లుగా చెల్లింపులు లేవు. ఆర్థిక లోటు కారణంగా ప్రస్తుతం ఏవైనా జమలు వస్తేనే పెండింగ్ బిల్లులను చెల్లిస్తున్నారు. జిల్లాలో ఉద్యోగులకు సంబంధించిన రవాణా భత్యాలు, వాహనాల అద్దెలు, సెలవులను నగదు మార్చుకోవడం వంటి బిల్లుల చెల్లింపులను నిలిపివేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలనెలా వేతనాలు చెల్లించడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, భవనాల అద్దెలు, స్టేషనరి, పుస్తకాల ముద్రణ, కార్యాలయం నిర్వహణ ఖర్చులకు కూడా నగదు లేదు.

తహశీల్దార్లు, ఇతర అధికారులు ఉపయోగించే వాహనాల అద్దెలను నెలలు తరబడి నిలిపివేస్తున్నారు. అయితే ఉద్యోగుల జీతాలు, పింఛన్లు చెల్లింపులకు ఆంక్షలు సడలించారు. మిగిలిన బిల్లులు ఆగిపోవడంతో జిల్లాలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విధంగా జిల్లా ఖజానా, ఉప ఖజానాలలో సుమారు 500 వరకు బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లకు భారీగా బిల్లులు ఆగిపోయాయి. ఉద్యోగులకు పీఆర్‌సీ అరియర్స్, జీపీఎఫ్, మెడికల్ రీయంబర్స్‌మెంట్ బిల్లులు, కాస్మోటిక్ చార్జీలు, స్కాలర్‌షిప్‌లు, తదితర బిల్లులు నిలిచిపోయాయి. గతంలో ఫలనా చెల్లింపులకు ఆంక్షలు విధించినట్లు ఖజానాశాఖ డైరెక్టర్ నుంచి ప్రత్యేక ఆదేశాలు అందేవి. ఆ అదేశాల ప్రకారం పద్దుకు చెల్లింపులు ఆపేవారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ పద్దుకు ఆంక్షలు విధించారో బిల్లుల వివరాలు క్రోడీకరించిన తర్వాత కంప్యూటర్ ద్వారా ఖజానా అధికారులు తెలుసుకోవాల్సి వస్తుంది.రవాణా, అబ్కారీ, అటవీ, గనులు, రాష్ట్ర పన్నులు…ఇలా ఆదాయం వచ్చే శాఖల నుంచి నగదు జమ అయితేనే చెల్లింపులు చేస్తున్నారు.

మైనింగ్ శాఖ పరిధిలో పర్యావరణ, ఇతర అనుమతులను కఠినతరం చేయడంతో ఆదాయం తగ్గుముఖం పట్టింది. జీఎస్టీ అమలుతో రాష్ట్ర వాటాగా రావాల్సిన పన్ను ఆదాయం రాలేదు. నెలకు సుమారు రూ.100 కోట్లకు పైగా అబ్కారీ (మద్యం) శాఖ నుంచి వచ్చే ఆదాయం ఒక్కటే వివిధ రకాల అత్యవసర ఖర్చులను గట్టెక్కిస్తుంది. జీఎస్టీ ప్రభావం వల్ల వివిధ విభాగాల నుంచి ప్రభుత్వం ఆశించిన స్థాయిలో రావడం లేదు. మధ్యాహ్న భోజనం బిల్లులు, వసతిగృహాల్లోని విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం లేదు. 14 ఆర్థిక సంఘం నిధుల నుంచి ఖర్చులను అనుమతించడం లేదు. దీనివల్ల స్థానిక సంస్థల్లో ఆర్థిక లావాదేవిలు, పరిపాలన మూడు వంతులకు పైగా నిలిచిపోయాయి… సరదా మాటున జూదం..కోడి పందెం.
Tags: Andhra pradesh, mines office,GST,excise department