23న కాదు.. బక్రీద్ రేపే: ఢిల్లీ షాహీ ఇమామ్

మళ్లీ మారిన బక్రీద్ సెలవు
గతంలో 23నే బక్రీద్ అన్న ముస్లిం మతపెద్దలు
రేపు జరుపుకోవాలన్న ఢిల్లీ ఇమామ్
బక్రీద్ సెలవులో మళ్లీ మార్పు చోటుచేసుకుంది. తొలుత బక్రీద్‌ను ఈనెల 22నే జరుపుకోవాలని ప్రకటించారు. తర్వాత దానిని 23కు మార్చారు. అయితే, తాజాగా ఢిల్లీ షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీ మాట్లాడుతూ బక్రీద్‌ను ఈ నెల 22నే జరుపుకోవాలని సూచించారు. చంద్ర దర్శనం ప్రకారం బక్రీద్‌ను బుధవారమే జరుపుకోవాలని స్పష్టం చేశారు. దీంతో కేంద్రం కూడా బక్రీద్ సెలవును 22కు మార్చింది.

వాస్తవానికి ఈనెల 22నే ప్రభుత్వం బక్రీద్ సెలవును ప్రకటించింది. అయితే, బక్రీద్‌ను ఈనెల 23న నిర్వహించనున్నట్టు ముస్లిం మతపెద్దలు కేంద్రానికి తెలిపారు. దీంతో సెలవును 22 నుంచి 23కు మారుస్తూ ప్రభుత్వం ఇటీవల అన్ని శాఖల పరిపాలనా కార్యాలయాలకు సర్క్యులర్ జారీ చేసింది. తాజాగా, ఢిల్లీ ఇమామ్ ప్రకటనతో సెలవులో మరోమారు మార్పు చోటుచేసుకుంది.
Tags: bakrid, festival, date, aug 23 , 2018, delhi, shahi iman