హరికృష్ణ, జానకిరామ్ కు కలసిరాని ‘2323’ నంబర్.?

  • జానకి రామ్ కారు నంబర్ ను వాడిన హరికృష్ణ
  • అదే రోడ్డుపై ఈ రోజు ప్రమాదంలో దుర్మరణం
  • తీవ్ర ఆవేదన చెందుతున్న అభిమానులు

నందమూరి హరికృష్ణ ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. అయితే ప్రమాదం సందర్భంగా హరికృష్ణ ప్రయాణించిన కారు నంబర్ ఆయన కుమారుడు జానకీ రామ్ ప్రయాణించిన కుమారుడి కారు నంబర్ ఒక్కటే కావడం చర్చనీయాంశం అయింది.

ఈ రోజు హరికృష్ణ ప్రయాణించిన కారు నంబర్ ఏపీ28 బీడబ్ల్యూ 2323 కాగా, జానకీ రామ్ చనిపోయినప్పుడు వాడిన కారు నంబర్ ఏపీ 29బీడీ 2323గా ఉంది. తండ్రీకొడుకులు ఒకే రోడ్డుపై, ఒకే నంబర్ కారులో చనిపోవడంపై నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కొడుకుపై ఉన్న ప్రేమతోనే హరికృష్ణ ఈ 2323 నంబర్ ను రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. తొలుత జానకీ రామ్, ఆ తర్వాత హరికృష్ణ నల్గొండ జిల్లాలోని అదే రోడ్డుపై ప్రాణాలు కోల్పోవడంపై అభిమానులు ఆవేదన చెందుతున్నారు.