స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్‌

 

విశాఖ: తెలంగాణ సీఎం కేసీఆర్‌ శారదా పీఠం ఆశ్రమం చేరుకున్నారు. రాజ శ్యామలాదేవీ ఆలయంలో కేసీఆర్‌ ప్రత్యేక పూజలు చేశారు. పూజల్లో స్వామి స్వరూపానంద పాల్గొన్నారు. అనంతరం స్వరూపానంద ఆశీస్సులు కేసీఆర్‌, కుటుంబసభ్యులు తీసుకుంది. శారదాపీఠం ఆవరణలో ఉన్న శమీ వృక్షానికి, విజయ హనుమాన్‌కు కేసీఆర్ దంపతుల పూజలు చేశారు. అంతకుముందు ఆశ్రమానికి చేరుకున్న కేసీఆర్‌కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ కుటుంబంతో కలిసి ఆశ్రమంలోనే మధ్యాహ్నం భోజనం చేశారు. కేసీఆర్‌ సీఎం హోదాలో తొలిసారి విశాఖకు రావడం విశేషం. కేసీఆర్‌ వెంట ఎంపీ సంతోష్‌, పొలిటికల్‌ సెక్రటరీ సుభాష్‌ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డి ఉన్నారు. సాయంత్రం 4.30 గంటలకు విశాఖ నుంచి భువనేశ్వర్‌కు వెళ్తారు.