సోమేశ్ కుమార్ కు న్యూ ఇయర్ కానుక తెలంగాణ సీఎస్ గా నియామకం

తెలంగాణ కొత్త సీఎస్‌గా సోమేశ్‌ కుమార్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌గా ఉన్న సోమేశ్‌ కుమార్‌. నేటి సాయంత్రం నుండి సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శైలేంద్ర కుమార్‌ జోషి పదవీకాలం నేటితో ముగిసింది.
నేడు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేశారు. . అనంతరం జోషి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగనున్నారు. అలాగే నీటిపారుదల వ్యవహారాల సలహాదారుడిగా వ్యవహరించనున్నారు. బీహార్‌కు చెందిన సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్‌కు చెందిన అధికారి. ఆయన 2023 డిసెంబర్ 31 వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు. సోమేశ్‌ గతంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గానూ విధులు నిర్వహించారు. సీఎం కేసీఆర్తో ఆయనకు గల సన్నిహిత సంబంధాలు,రిటైర్మెంట్ కు ఎక్కువ సమయం ఉండటంతో అజయ్ మిశ్రాకు బదులు సోమేశ్ కుమార్ నియామకానికి నిర్ణయించినట్లు స్పష్టమైంది.