సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘దేవదాస్’

కామెడీ ఎంటర్టైనర్ గా ‘దేవదాస్’
భారీస్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్
ఈ నెల 27వ తేదీన విడుదల
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున .. నాని కథానాయకులుగా ‘దేవదాస్’ సినిమా రూపొందింది. కామెడీ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాలో నాగార్జున సరసన కథానాయికగా ఆకాంక్ష సింగ్ .. నాని జోడీగా రష్మిక మందన నటించారు. తాజాగా ఈ సినిమా సెన్సారు కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు/ఏ సర్టిఫికెట్ ను సంపాదించుకుంది.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీస్థాయిలో జరిగిందని అంటున్నారు. అటు నాగార్జున అభిమానులు .. ఇటు నాని ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకంతో అభిమానులు వున్నారు. వాళ్ల నమ్మకం ఎంతవరకూ నిలబడుతుందో చూడాలి మరి.