సీఎంగా జగన్ తీసుకున్న నిర్ణయాల్లో ఇదే హైలైట్!

సీఎంగా జగన్ తీసుకున్న నిర్ణయాల్లో ఇదే హైలైట్!

ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ విలీనం
క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం
జగన్ సంచలన నిర్ణయం!
నేడు నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలని వివరించడానికి మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ మానవతా దృక్పథంతో వ్యవహరించి నష్టాలతో కుదేలైన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారని వివరించారు.

నష్టాలతో ఉన్న ఆర్టీసీని ఆదుకునే క్రమంలో సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని, అయితే విలీన ప్రక్రియ విధివిధానాల కోసం ఆర్థిక, రవాణాశాఖ మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు. నిపుణుల సలహాలు, అభిప్రాయాలు కూడా తీసుకోనున్నారు. ఈ మేరకు క్యాబినెట్ భేటీలో సంచలన నిర్ణయం తీసుకున్నారు.