సిబిఐ వివాదంలో మోదీ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్ మోడీ సర్కారుకు చెంపపెట్టు :కాంగ్రెస్

సిబిఐ ని సరైన బాటలో నడిపేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సిబిఐ వివాదంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం సిబిఐ వివాదం పై తీసుకున్న నిర్ణయాన్ని దేశ అత్యున్నత ధర్మాసనం ఆక్షేపించింది. ఆలోక్ వర్మకు తిరిగి సిబిఐ డైరెక్టర్ గా భాద్యతలు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.ఆలోక్ వర్మను సెలవు పై పంపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశంతో సిబిఐ డైరెక్టర్ ఆలోక్ వర్మకు సుప్రీంకోర్టు లో పెద్ద ఊరట లభించినట్లైంది.ఆలోక్ వర్మను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అలోక్ వర్మను సెలవు పై పంపడం కుదరదు అని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. సివిసి, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పక్కనపెట్టింది సుప్రీంకోర్టు. ఆలోక్ వర్మ పై కేంద్రం నిర్ణయాన్ని సెలెక్ట్ ప్యానల్ పంపాలని ఆదేశాలు జారీ చేసింది.భారత దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ వివాదంలో చిక్కుకున్నది. సిబిఐ ని సరైన బాటలో నడిపేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.

సిబిఐ వివాదంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. సిబిఐలో అంతర్గత వివాదాలు పొడసూపడంతో గతంలోడైరెక్టర్ గా ఉన్న అలోక్ వర్మను బలవంతంగా సెలవుపై పంపింది కేంద్ర సర్కారు. దీంతో తనను సెలవుపై పంపడాన్ని అలోక్ వర్మ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కాగా సీబీఐ వ్యవహారంలో కేంద్రం నిర్ణయాన్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంపై ధ్వజమెత్తింది. ప్రధాని మోదీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలను సుప్రీం పక్కన పెట్టిందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ట్వీట్‌ చేశారు. ప్రధాని అక్రమ ఆదేశాలు ఇచ్చారంటూ సుప్రీంకోర్టు వాటిని పక్కన పెడుతూ ఇలా నిర్ణయం తీసుకోవడం మోదీ విషయంలోనే జరిగిందని, ఇలా జరిగిన తొలి ప్రధాని ఆయనేనని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి కానీ.. సంస్థల సమగ్రతను కోర్టు కాపాడిందనే విషయాన్ని మోదీ గుర్తుంచుకోవాలని అన్నారు.

మన ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బలోపేతం చేసేందుకు ఇది ఒక గుణపాఠం కావాలని, మీరు ఎంత ఎదురులేని వ్యక్తి అయినప్పటికీ చట్టం దానికి ముగింపు పలికిందని సుర్జేవాలా మోదీని ఉద్దేశించి విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి చెంప పెట్టు అని రాష్ట్రీయ జనతా దళ్‌ ఎంపీ మనోజ్ ఝా పార్లమెంటు ఎదుట విలేకరులతో అన్నారు. కోర్టు తీర్పు ప్రధాని మోదీపై ప్రత్యక్ష నేరారోపణ అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. మోదీ ప్రభుత్వం దేశంలోని ప్రజాస్వామ్యాన్ని, సంస్థలను దెబ్బతీసిందని అన్నారు. రఫేల్‌ ఒప్పందంపై విచారణను ఆపేందుకు సీబీఐ డైరెక్టర్‌ను రాత్రికి రాత్రి తప్పిస్తారా అంటూ ట్విటర్‌లో ప్రశ్నించారు. సుప్రీం తీర్పు ఆలోక్‌ వర్మకు పాక్షిక విజయం అని న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వెల్లడించారు.
Source: telugurajyam